ఫలించిన ఎంపీ వైఎస్ అవినాష్ కృషి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫలించిన ఎంపీ వైఎస్ అవినాష్ కృషి

ఫలించిన ఎంపీ వైఎస్ అవినాష్ కృషి

Written By news on Thursday, September 10, 2015 | 9/10/2015


ఫలించిన ఎంపీ వైఎస్ అవినాష్ కృషి
- తుంపెర కాలువలో స్కేలు ఏర్పాటుకు చర్యలు
- ఇక నుంచి పీబీసీ రైతులకు న్యాయం
- స్కేలు ఏర్పాటును పరిశీలించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి
లింగాల : 
గత 30 ఏళ్లుగా పీబీసీ రైతులకు తుంపెర డీప్‌కట్ కెనాల్‌లో ఏర్పాటు చేసిన నీటి సామర్యాన్ని చూపే స్కేలు వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోంది.  హెచ్‌ఎల్‌సీ అధికారులు తుంపెర కాలువకు వాల్వు గోడకు స్కేలు ఏర్పాటు చేసి నీటి విడుదల రీడింగ్ తీసేవారు. ఏడాది క్రితం పీబీసీ అధికారులు కాలువ మధ్యలో నిటారుగా మరో స్కేలు ఏర్పాటు చేశారు. గోడకు ఏర్పాటు చేసి న స్కేలు ద్వారా 472క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నట్లు, కాలువ మధ్య లో ఏర్పాటు చేసిన స్కేలు ద్వారా 355 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు చూపిస్తోంది. ఈ రెండింటి మధ్య 117 క్యూసెక్కుల నీటి వ్యత్యాసం ఉంది. దీనిపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హెచ్‌ఎల్‌సీ, ఐఏబీ సమావేశాల్లో అధికారులను గట్టిగా నిలదీశారు. దీంతో కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లేగాక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులలో చలనం కలిగి మేల్కొన్నారు.

దీంతో కాలువలో నీటి ప్రవాహం, సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి స్కేలు ఏర్పా టు చేసేందుకు, గేజ్ మేనేజ్‌మెంటు అధికారులు, హెచ్‌ఎల్‌సీ, పీబీసీ అధికారు లు బుధవారం ఉదయం తుంపెర డీప్‌కట్ కెనాల్‌కు చేరుకున్నారు. అధునాతన పరికరాలతో కాలువను అడ్డంగా కొలతలు నిర్వహించి 12పాయింట్లు గుర్తించారు. ప్రతి పాయింట్ వద్ద ఫిస్స ర్ వెయిట్ అనే యంత్రాన్ని నీటిలోకి దించి ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా నిమిషానికి ఎంత నీటి ప్రవాహం ఉందని గుర్తించారు. ఈ నివేదికలను ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు నూతనంగా మరో స్కేలు ఏర్పా టు చేస్తామని రీసెర్చ్ ఆఫీసర్ ప్రభాకర్ శాస్త్రి తెలిపారు.

ఈ సందర్భంగా పులి వెందుల వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ నాయకుడు వైఎస్ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పీబీసీ రైతులకు ప్రతి ఏటా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తు తం ఏర్పాటు చేయనున్న స్కేలులో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా పారదర్శకంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గేజ్ మేనేజ్‌మెంట్ ఏడీ శరత్‌కుమార్, అనంతపురం ఈఈ హెలెన్, ఏఈఈ హేమలత, హెచ్‌ఎల్‌సీ లోకలైజేషన్ డీఈ నటరాజ్, పీబీసీ ఈఈ మురళీకృష్ణ, ఏఈఈ నరసింహారెడ్డి, పీబీసీ నీటిసంఘం మాజీ అధ్యక్షుడు చప్పిడి రమణారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రసూల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: