వైఎస్ జగన్‌కు మద్దతుగా పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌కు మద్దతుగా పాదయాత్ర

వైఎస్ జగన్‌కు మద్దతుగా పాదయాత్ర

Written By news on Sunday, September 27, 2015 | 9/27/2015


రాజమండ్రి టూ విజయవాడ
- వైఎస్ జగన్‌కు మద్దతుగా పాదయాత్ర
- దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
 విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా రాజమండ్రికి చెందిన పలువురు పార్టీ నాయకులు మహా పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు సుమారు 180 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ర్ట కార్యదర్శి గిరిజాల వీర్రాజు (బాబు) ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర విజయవాడ దుర్గగుడి టోల్‌గేటు వద్దకు చేరుకోగా పార్టీ యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ వారికి స్వాగతం పలికారు. వైఎస్ జగన్ కోసం యూత్ విభాగం ఆధ్వర్యంలో పాదయాత్ర చేసినవారిని పేరుపేరునా ఆయన పలకరించి అభినందనలు తెలిపారు.  

అనంతరం టోల్‌గేటు వద్ద కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధనకు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు మొక్కుకున్నారు. రాష్ర్ట యువత మేలు కోసం జగన్ దీక్ష చేస్తే, ఆయనకు ఎక్కడ పేరు వచ్చేస్తుందోనని అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టి దీక్షకు అనుమతి నిరాకరించడం సిగ్గుచే టని వీర్రాజు పేర్కొన్నారు. ఈ నెల 22ఉదయం కడియం నుంచి సుమారు 100 మంది పార్టీ నేతలు, వివిధ విభాగాల నాయకులు పాదయాత్రగా బయలుదేరామని, ఐదు రోజుల పాటు యాత్ర సాగిందని వివరించారు.  పలు గ్రామాల ప్రజల నుంచి ఆదరణ లభించిందని, జననేతకు మద్దతుగా చేపట్టిన పాదయాత్రకు స్వాగతం పలికారని చెప్పారు. పాదయాత్రలో రాష్ర్ట బీసీ సెల్ కార్యదర్శి దాసరి శేషగిరి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాకా సతీష్, బీసీ నాయకులు లావేటి రమేష్, కుడేటి సురేష్, యార్లగడ్డ సత్తిబాబు, బత్తిన శ్రీధర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Share this article :

0 comments: