వారికి భరోసా ఇవ్వకుండా ఆ మాటెలా చెబుతావు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వారికి భరోసా ఇవ్వకుండా ఆ మాటెలా చెబుతావు?

వారికి భరోసా ఇవ్వకుండా ఆ మాటెలా చెబుతావు?

Written By news on Thursday, October 1, 2015 | 10/01/2015


రైతులు సుఖంగా ఉన్నారా..
వారికి భరోసా ఇవ్వకుండా ఆ మాటెలా చెబుతావు?
చంద్రబాబును నిలదీసిన  ఎమ్మెల్యే చాంద్‌బాషా


 సాక్షి, హైదరాబాద్ : తన పాలనలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని గొప్పలు చెప్పుకుంటూ అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ‘రైతుకోసం చంద్రన్న యాత్ర’ విజయోత్సవ ముగింపు సభను జరుపుకోవడం దురదృష్టకరం, బాధాకరమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాషా అన్నారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘అనంతపురం జిల్లాలో ముగింపుసభ ఎందుకు పెట్టారు? ఏ జిల్లాలో లేనివిధంగా 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా?’’ అని ఆయన సీఎంను ప్రశ్నించారు. ఆత్మహత్యల గురించి ప్రస్తావించకుండా, వారికెలాంటి భరోసా ఇవ్వకుండా రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని ఎలా చెబుతారో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

 ప్రగల్భాలు చెప్పుకోవడమేంటీ?
 ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు ఇచ్చిన నివేదికలో రైతుల రుణాలు రూ.94 వేల కోట్లుంటే కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే చెల్లించి రుణమాఫీ చేసేశామని ప్రగల్భాలు చెప్పుకోవడం ఏమిటని చాంద్‌బాషా నిలదీశారు.

 అనంత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన ఘనత బాబుదే..
 తమ జిల్లాలో రైతులకివ్వాల్సిన 2013-14 సంవత్సరానికి సంబంధించిన రూ.603 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇస్తానని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకొచ్చాక ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రైతు సాధికారమిషన్ నుంచి ఒక్క రైతుకూ సాయం చేయడంగానీ, ప్యాకేజీ ఇవ్వడంగానీ చేయలేదని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: