నేడు అనంత, గుంటూరు జిల్లాలకు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు అనంత, గుంటూరు జిల్లాలకు జగన్

నేడు అనంత, గుంటూరు జిల్లాలకు జగన్

Written By news on Sunday, October 25, 2015 | 10/25/2015


నేడు అనంత, గుంటూరు జిల్లాలకు జగన్
 పలు వివాహాలకు హాజరు

  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పలు వివాహాలకు హాజరుకానున్నారని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం ఉదయం గుంతకల్‌కు సమీపంలోని కసాపురంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడి వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత బె ంగుళూరుకు చేరుకుంటారు. అనంతరం విమానంలో విజయవాడకు వెళ్లి పార్టీ జిల్లా గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ కుమారుని వివాహంతోపాటు స్థానికంగా నిర్ణయించే ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బెంగళూరు నుంచి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జగన్ గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేట మార్కెట్ యార్డులో రాత్రి 11.33 నిమిషాలకు జరగనున్న వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారని తెలిపారు.
Share this article :

0 comments: