- భోగాపురం రైతుల బాధను రాష్ట్రానికే కాదు దేశానికి చూపించేందుకు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం
- మా భూములు లాక్కోవద్దని రైతులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
- ఎయిర్ పోర్టు కోసం గద్దల్లా రైతుల భూములు లాక్కోవడానికి సిద్ధమయ్యారు
- లంచాలకోసం కమిషన్ల కోసం చిన్న రైతులను రోడ్డున పడేస్తున్నారు
- అవంతి శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు భూములు ఎందుకు మినహాయించారు
- వీళ్లంతా చంద్రబాబు బినామీలు కాబట్టే వారికి లాభం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది
- భూముల లాక్కునే విషయంలో ప్రధానమంత్రే వెనక్కు తగ్గారు
- ఇంత మంది ఉసురు పోసుకుని భూములు లాక్కునే అధికారం చంద్రబాబుకు లేదు
- పక్కనే ఉన్న విశాఖపట్నం విమానాశ్రయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి
- ఎయిర్ పోర్టుకు 150 నాటికల్ మైళ్ల అవతల మాత్రమే మరో ఎయిర్ పోర్టు కట్టాలి
- విశాఖ విమానాశ్రయం ఇక్కడికి కనీసం 20 నాటికల్ మైలు దూరంలో కూడా లేదు
- చెన్నై ఎయిర్ పోర్టు1280 ఎకరాలు, కొచ్చి 800, అహ్మదాబాద్ 960, ముంబై ఎయిర్ పోర్ట్ 2000 ఎకరాల్లోపు ఎకరాల్లో ఉంది
- భోగాపురం ఎయిర్ పోర్టుకు వేల ఎకరాలు ఎందుకు
- ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు లాక్కోనివ్వం
- మంచి అన్నలా తోడుగా ఉంటా, అవసరమైతే కోర్టుకు పోదాం
- గట్టిగా పోరాడతా, గట్టిగా నిలబడతా... ఈ పోరాటం ఆగదు, అన్ని రకాలుగా అండగా ఉంటా
- ఒకవేళ అధికార బలంతో ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కున్నా బాధపడకండి. మూడేళ్ల తర్వాత టీడీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది
- రాబోయేది మన ప్రభుత్వం. మేము అధికారంలోని వచ్చిన తర్వాత లాక్కున్న భూములు తిరిగిస్తాం
Home »
» 'మంచి అన్నలా తోడుగా ఉంటా
'మంచి అన్నలా తోడుగా ఉంటా
Written By news on Monday, October 5, 2015 | 10/05/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment