వైఎస్ జగన్ దీక్షకు మందకృష్ణ మాదిగ సంఘీభావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ దీక్షకు మందకృష్ణ మాదిగ సంఘీభావం

వైఎస్ జగన్ దీక్షకు మందకృష్ణ మాదిగ సంఘీభావం

Written By news on Thursday, October 8, 2015 | 10/08/2015


వీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. గురువారం గుంటూరులోని దీక్షా శిబిరానికి వచ్చిన ఆయన జగన్ ను పరామర్శించారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ దీక్షలను రాజ్యాంగ విరుద్ధంగా అడ్డుకోవడం మూర్ఖపు చర్య అవుతుందని హెచ్చరించారు. విజయవాడలో జగన్ రైతు లక్ష్యదీక్ష పెట్టినప్పుడు కూడా రైతుల కోసం, ప్రజల కోసం చేస్తున్న ఆ పోరాటంలో ఎమ్మార్పీఎస్ సంఘీభావం తెలిపిందని గుర్తుచేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
 • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్ పిలుపు మేరకు బంద్ జరిగితే.. ఆ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చాను. ప్రకాశం జిల్లా ఒంగోలులో నేను స్వయంగా బంద్ లో పాల్గొన్నాను
 • ఈరోజు కూడా ఒక న్యాయమైన పోరాటం జరుగుతోంది. 5 కోట్ల మంది ఆంధ్రప్రజల ఆకాంక్షకు గుర్తుగా జగన్ దీక్ష చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారు. కుత్సిత మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారు
 • నిలదీయడంలో వైఫల్యం చెందినప్పుడు టీడీపీ నేతలు కేంద్రంలో ఎందుకుండాలి, ఏపీ ప్రజల భవిష్యత్తు ముఖ్యమా.. మీ వ్యాపారాలు ముఖ్యమా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం
 • ప్రజల భవిష్యత్తు దృష్ట్యా కేంద్ర మంత్రివర్గంలో చేరితే అభ్యంతరం లేదు. కానీ ఒప్పించే ప్రయత్నం కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారని, దీనికోసం ఏపీ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని తెలుస్తోంది
 • మీరు అక్కడుండి ప్రత్యేక హోదా సాధించలేనప్పుడు రాజీనామా చేసి రండని ప్రశ్నిస్తే వాళ్లిచ్చిన జవాబులు చూసి ఆశ్చర్యం అనిపించింది
 • మేం తప్పుకొంటే వెంటనే మీరు ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని తహతహలాడుతున్నావని టీడీపీ నేతలు జగన్ పై విమర్శలు చేశారు
 • ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగిరాకపోతే.. మీరు కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగినా జగన్ దాన్ని స్వాగతిస్తారు, ఆయన ఎన్డీయేతో చేతులు కలపరని నేను విశ్వసిస్తూ, జగన్ తరఫున హామీ ఇస్తున్నా
 • ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నా
 • ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిని చిక్కుల్లో పెట్టాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన వాళ్లకు లేదు
 • ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. విభజన సమయంలో అది డిమాండు కూడా కాదు.
 • ఒకప్పుడు విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినదించి విశాఖ స్టీలుప్లాంటును ఎలా సాధించుకున్నారో, ఇప్పుడు ప్రత్యేక హోదాను కూడా అలాగే సాధించుకుంటారు
 • ఆ హోదా ఇవ్వకపోతే ఎన్నికలు ఎప్పుడొచ్చినా అడ్రస్ కూడా లేకుండా పోతారని టీడీపీ, బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాను.
 • ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలామంది ప్రజలు ఉమ్మడి రాష్ట్రం కావాలనే కోరుకున్నారు
 • ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు.
 • కానీ ఇష్టారాజ్యంగా తలుపులు వేసి రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టి తీవ్ర అన్యాయం చేశారు
 • ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సమాధి కట్టారు. అసెంబ్లీలో గానీ, పార్లమెంటులో గానీ ఆ పార్టీ సభ్యులెవరూ అడుగుపెట్టకుండా గట్టి బుద్ధి చెప్పారు.
Share this article :

0 comments: