నేడు భోగాపురానికి వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు భోగాపురానికి వైఎస్ జగన్

నేడు భోగాపురానికి వైఎస్ జగన్

Written By news on Monday, October 5, 2015 | 10/05/2015


నేడు భోగాపురానికి వైఎస్ జగన్
సాక్షి, భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు బాధితులకు భరోసా ఇచ్చేందుకు సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. మండలంలోని కవులవాడ గ్రామంలో ఆదివారం పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్ టూర్ షెడ్యూల్‌ను వివరించారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో జగన్ మహరాజుపేట వద్దకు చేరుకుంటారని, అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

మధ్యాహ్నం 2.45 గంటలకు ఎ.రావివలస రిలేనిరాహార దీక్ష శిబిరం వద్ద బాధితులతో మాట్లాడతారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గూడెపువలస గ్రామానికి చేరుకుని ముందుగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. సభ అనంతరం కవులవాడ గ్రామానికి చేరుకుని అక్కడ బాధితులతో మాట్లాడి బయలుదేరుతారని చెప్పారు.
Share this article :

0 comments: