జగన్ దీక్షకు మద్దతు ప్రకటించిన యూనివర్సిటీల విద్యార్థులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ దీక్షకు మద్దతు ప్రకటించిన యూనివర్సిటీల విద్యార్థులు

జగన్ దీక్షకు మద్దతు ప్రకటించిన యూనివర్సిటీల విద్యార్థులు

Written By news on Wednesday, October 7, 2015 | 10/07/2015


గళమెత్తిన యువగళం
గుంటూరులో జగన్ దీక్షకు మద్దతు ప్రకటించిన యూనివర్సిటీల విద్యార్థులు

ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న దీక్ష.. ఒకరోజు ముందుగానే విద్యార్థుల్లో కదలిక తెచ్చింది.  రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలు వేదికగా.. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని ఎండగట్టాలని తీర్మానించుకున్నారు. ప్యాకేజీలతో రాజీపడి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటే వైఎస్ జగన్ చేస్తున్న దీక్షకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇకపై అంతా కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో..
సమైక్య ఉద్యమ పురిటిగడ్డ అయిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వేదికగా ప్రత్యేకహోదా ఉద్యమానికి జవసత్వాలు నింపేందుకు విద్యార్థులంతా ఏకమయ్యారు. హోదా సాధించేవరకు ఏ బెదిరింపులకూ భయపడకుండా ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించారు. ఎన్నో ప్రయో జనాలున్న ప్రత్యేక హోదాను ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురు ఆత్మార్పణం చేసుకున్నారని, వారి ఆత్మశాంతికోసమైనా ఇకపై ఉద్య మించాలని నిర్ణయించుకున్నారు.

రాష్ట్ర విభజనే అన్యాయం. అంతోఇంతో న్యాయం జరిగే మార్గం ప్రత్యేక హోదా సాధన ఒక్కటే. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ , టీడీపీ ఇదే తరహాలో డిమాండ్ చేశాయి. రాష్ట్రాన్ని విభజించేముందు పార్లమెంటులో ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన కమిటీ సభ్యులు బాలస్వామి, డాక్టర్ వీరబ్రహ్మం, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో..
కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ వల్ల నష్టమేనని, రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో అవతరించిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే ఆసరా దొరుకుతుందని విశాఖ విద్యార్థులు నినదించారు. ఆంధ్ర విశ్వావిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక హోదా చర్చాగోష్టిలో ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి కలిగే లాభం, ప్రత్యేక ప్యాకేజీ వల్ల కలిగే నష్టాలను చర్చించారు. జగన్ నిరవధిక దీక్షకు మద్దతు పలకాలని తీర్మానించుకున్నారు.

ప్రత్యేక హోదా సాధించడానికి ప్రతిపక్షనేత ఉద్యమించడం విద్యార్థిలోకానికి కొండంత ధైర్యాన్నిచ్చిందన్నారు. ఎమ్మెస్సీ పీడీఎఫ్ సోషల్‌వర్క్ విభాగం విద్యార్థి బి. మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే పన్నుల్లో రాయితీలు వస్తాయని, రాయితీలు వస్తే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని, కంపెనీలు వస్తే ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభాశం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఏయూలో...
ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమని ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ వేదికగా విద్యార్థులు నినదించారు. హోదా అవసరంపై మంగళవారం వర్సిటీలో సమావేశమయ్యారు. ఏపీ లోటు బడ్జెట్‌తో ఉందని, నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించినా నియామకాలు చేపట్టలేని దుస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు హోదాపై చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమాలు చేస్తుంటే, అధికార పక్షం అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరంలో...
ప్రత్యేక హాదా ఇవ్వకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని.. పార్లమెంటు సాక్షిగా పాలకులు ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేవరకు ఉద్యమి స్తామని విజయనగరం విద్యార్థులు తీర్మానించుకున్నారు. ప్రత్యేకహోదా  కోసం ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో ఈరోజు నుంచి చేస్తున్న దీక్షకు తామంతా అండగా నిలబడతామని ప్రకటిం చారు. విజయ నగరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సత్యా డిగ్రీకాలేజీ, సత్యా పీజీ కాలేజీ, ఎంఆర్, సీతం ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

అధిక శాతం ఉపాధిని కల్పించే కెమికల్, ఫార్మస్యుటికల్ పరిశ్రమలు పూర్తిగా హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులు అక్కడికెళ్తే మీది ఈ రాష్ట్రం కాదు.. పొమ్మంటున్నారని విద్యార్థులు  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్ర ప్రభుత్వ రాయితీలతో అవే పరిశ్రమలు మన రాష్ట్రంలో ఏర్పాటవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమ గోదావరిలో...
ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా తప్పనిసరి అని, దానిని సాధించి తీరాలని విద్యార్థి లోకం గళమెత్తింది. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలోని కరిబండి సుబ్బారావు మోమోరియల్ విద్యాసంస్థల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు మంగళవారం ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ప్రత్యేకహోదాతోనే ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, పన్ను రాయితీలు వస్తాయని, ప్యాకేజీల వల్ల లాభం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు చేస్తున్న వారికి ప్రతి ఒక్కరూ సహకరించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.

‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులందరికీ ఉపాధి దొరుకుతుంది. మన అవసరాలు తీరడంతోపాటు అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధించడం మరింత సులభమవుతుం’ని బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పి. గంగాభవాని పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వస్తే మనం కొనే వస్తువుల ధరలు సగానికి సగం తగ్గుతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఆర్థిక పరిస్థితి చక్కబడుతుందని మరికొంతమంది విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఒంగోలులో..
ఒంగోలులోని  నాగార్జున డిగ్రీ కాలేజీ ఆవరణలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మంగళవారం సదస్సు నిర్వహించారు. సదస్సులో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ షంషేర్ అహ్మద్ మాట్లాడుతూ హోదా వస్తే రాష్ట్రానికి నిధుల కేటాయింపులో రాజ్యాంగ బద్ధమైన హక్కు లభిస్తుందన్నారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై జగన్‌మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలన్నారు. 

చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక ప్యాకేజీ కోసం వెంపర్లాడుతూ, రాష్ట్రంలో ప్రత్యేక హోదా పై కృషి చేస్తున్నానని కల్లబొల్లి కబుర్లు చెప్పడం దారుణమన్నారు. డిగ్రీ విద్యార్థిని ఊహారాణి మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో ఏ కంపెనీకి పోయినా ప్రస్తుత పరిస్థితుల్లో నో వేకెన్సీ బోర్డులు కనిపిస్తున్నాయని, ఆ బోర్డులు పోయి వాంటెడ్ బోర్డులు రావాలంటే ఏపీ ప్రత్యేక హోదా తప్పనిసరిగా రావాల్సిందేనన్నారు. చిత్తశుద్ధితో అందరూ ముందుకు సాగితేనే హోదా సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.

కర్నూలులో...
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని విద్యార్థి సంఘాలు ఉద్ఘాటించాయి.  మంగళవారం నారాయణ జూనియర్ కళాశాలలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా-ఆంధ్రుల హక్కు అనే అంశంపై సదస్సు నిర్వహించారు.  పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లు మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌పై వివక్ష చూపుతున్నాయన్నారు. జగన్‌తో కలిసి ఉద్యమించి, హోదా సాధించుకుందామని తీర్మానించుకున్నారు.

నెల్లూరులో...
ప్రత్యేక హోదా అంధ్రుల హక్కుని, ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఉద్యమిస్తామని విద్యార్ధి లోకం గళమెత్తింది. స్థానిక రామలింగాపురంలోని శ్రీచైతన్య కళాశాలలో మంగళవారం వైఎస్సార్ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ ఆధ్వర్యంలో హోదాపై సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుంటే రాష్ట్రం పూర్తిగా వెనుకబడుతుందని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రత్యేకహోదా కోసం నిరవధిక దీక్ష చేపడుతున్న జగన్మోహనరెడ్డికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నామన్నారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి ఆర్‌టీ సిద్ధార్థ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుంటే నిరుద్యోగం పెరుగుతుందని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ది చెందు తుందన్నారు.
Share this article :

0 comments: