కేంద్రం సంకేతాలిస్తున్నా ఖండించలేరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రం సంకేతాలిస్తున్నా ఖండించలేరా?

కేంద్రం సంకేతాలిస్తున్నా ఖండించలేరా?

Written By news on Saturday, October 31, 2015 | 10/31/2015


కేంద్రం సంకేతాలిస్తున్నా ఖండించలేరా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం సంకేతాలిస్తున్నా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలపై ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘ప్రత్యేకహోదాపై గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కొనసాగుతుందని పార్లమెంటు సాక్షిగా రాతపూర్వకంగా సమాధానమిచ్చింది.

కానీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వబోమని నేడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిస్తుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనీసం ఒత్తిడి తీసుకురాకపోవడం తప్పు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ మంత్రులను అలానే కొనసాగించడం మరో తప్పు. కనీసం అరుణ్ జైట్లీ ప్రకటనను ఖండిస్తూ ప్రకటన కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ముఖ్యమంత్రి ఉండటం శోచనీయం’ అని జగన్ ట్వీట్ చేశారు.
Share this article :

0 comments: