
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడిపై ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రధాని నరేంద్ర మోదీ చేత చంద్రబాబు మట్టి, నీళ్లు తెప్పించారని ఆయన శనివారం ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చంద్రబాబు లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అందుకే కేసీఆర్ ను చంద్రబాబు అందలం ఎక్కించారని వ్యాఖ్యానించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో చెరుకు పంటలు తగులపెట్టడంపై విచారణ జరిపేందుకు తమ పార్టీ తరపున ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా శుక్రవారం గుర్తు తెలియని దుండగులు... రైతు గద్దె చంద్రశేఖర్ చెరకు పంటను తగలబెట్టారు. ఐదు ఎకరాల్లో ఉన్న చెరకును నాశనం చేశారు. మల్కాపురంలో ఈ ఘటన జరిగింది. రెండు ఎకరాల్లో చెరకు పంట పూర్తిగా, మూడు ఎకరాల్లో పాక్షికంగా ధ్వంసమైంది. రైతు చంద్రశేఖర్ ల్యాండ్ పూలింగ్‌లో రాజధానికి భూములు ఇవ్వలేదు. దీంతో కక్ షకట్టే ఈ చర్యకు పాల్పడి ఉంటారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
0 comments:
Post a Comment