మద్దతివ్వండి.. విమర్శిస్తే సహించం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మద్దతివ్వండి.. విమర్శిస్తే సహించం

మద్దతివ్వండి.. విమర్శిస్తే సహించం

Written By news on Thursday, October 8, 2015 | 10/08/2015


'మద్దతివ్వండి.. విమర్శిస్తే సహించం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హోదా కోసం, రాష్ట్ర ప్రజల బాగుగోసం, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. అలాంటి ఆయనకు మద్దతు పలికి వెంట రావాల్సిందిపోయి విమర్శలు చేస్తారా అని ఆమె మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వ నాయకులు చేస్తున్న ప్రకటనలపట్ల వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. చేతనైతే ప్రజల అభీష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, బీజేపీతో భాగస్వాములైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే ఏపీ ప్రజల డిమాండ్ ను ప్రధాని నరేంద్రమోదీకి చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకానీ, ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ను విమర్శిస్తే మాత్రం సహించేది లేదని చెప్పారు.

మరోపక్క,  నిరవధిక నిరాహార దీక్షకు భారీ ఎత్తున మద్ధతు లభిస్తోంది. రెండో రోజు కూడా వివిధ ప్రాంతాలనుంచి ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో దీక్ష వద్దకు వస్తున్నారు. పలువురు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లోనే ఎన్నారైలు కూడా ఈ దీక్షపట్ల భారీగా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగిన వైఎస్ జగన్ కు వారంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు
Share this article :

0 comments: