నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర

నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Thursday, October 1, 2015 | 10/01/2015


నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
కరీంనగర్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గురువారం నుంచి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన కుటుం బాలకు అండగా ఉంటానంటూ నల్లకాల్వ వద్ద వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుం బ ప్రతినిధిగా షర్మిల పరామర్శ యాత్ర కొనసాగిస్తున్న విషయం విదిత మే. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో పర్యటించి 12 కుటుంబాలను షర్మిల పరామర్శించారు.

వైఎస్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మొత్తం 30 మంది చనిపోగా మిగిలిన 18 కుటుంబాలను పరామర్శించేందుకు గురు వారం నుంచి మలిదశ పరామర్శ యాత్ర కొనసాగించనున్నారు. మూడు రోజులపాటు జిల్లా లో పర్యటించనున్న షర్మిల మొత్తం 481 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిస్తారు. ఇందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 యాత్ర కొనసాగేదిలా...
 గురువారం ఉదయం 8.30 గంటలకు షర్మిల హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. కరీం నగర్ జిల్లా తోటపల్లి వద్ద వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాష్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్‌లు షర్మిలకు ఘన స్వాగతం పలకనున్నారు. అక్క డినుంచి నేరుగా కోహెడ మండలం వర్కోలు వెళ్లి పెంట పర్తి సాహితీ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం కూరెల్ల, ధర్మసాగర్, నందా రం, పోతారం, మల్లంపల్లి, కొత్తపల్లి, దామెర గ్రామాల్లో ల్యాగల లక్ష్మారెడ్డి, మోత్కుల శ్రీని వాస్, అజ్మీర తుక్యానాయక్, బత్తిని ఎల్లయ్య, బూడిద లస్మమ్మ, వేల్పుల ప్రభాకర్, జక్కుల సులోచన కుటుంబాలను కలుసుకుంటారు. తొలిరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే పర్యటించి మొత్తం 8 కుటుంబాలను పరామర్శిస్తారు. రాత్రి హుజారాబాద్‌లో బస చేస్తారు.

 రెండోరోజైన శుక్రవారం హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో షర్మిల ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు. అందులో భాగంగా హుజారాబాద్ మండలం సిర్సపల్లి, రాంపూర్, జమ్మికుంట మండలం ధర్మారం, గండ్రపల్లిలో ఎడ్ల వెంకటనర్సు, సుంచు తిరుపతి, పసుపుల మొగిలి, గాదె ఉప్పలయ్య కుటుంబాలను కలుస్తారు. అనంతరం కేశవపట్నం, లక్ష్మీపూర్, బంజేరుపల్లిలో కాసరాజుల లక్ష్మయ్య, ఎడ్ల శ్రీనివాస్, రేణికుంట కొమురయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. రాత్రి కరీంనగర్‌లో బస చేస్తారు.

 మూడోరోజైన శనివారం బోయినిపల్లి మండ లం స్తంభంపల్లి, సిరిసిల్ల మండలం మండేపల్లి, చీర్లవంచలో చంద్రగిరి నర్సమ్మ, కొమ్మెట లచ్చయ్య, ఈసరి లచ్చవ్వ కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం జిల్లాలో యాత్ర ముగించి కామారెడ్డి మీదుగా ఆదిలాబాద్ జిల్లాలో పరామర్శ యాత్రకు బయలుదేరి వెళతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: