రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి

రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి

Written By news on Saturday, October 31, 2015 | 10/31/2015


రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక పోరుకి సిద్ధమైన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ....అభ్యర్ధి  ఎంపిక కోసం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అభ్యర్ధి ఎంపికపై నేతలందరితో సమాలోచనలు జరిపి, అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ....పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రచారానికి వైఎస్ జగన్‌తో పాటు ఆయన సోదరి షర్మిల వస్తారని తెలిపారు.  కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలే ఆయుధంగా ....ఎన్నికల బరిలో దిగుతామన్నారు.
Share this article :

0 comments: