ఆ నివేదికలో ఏముందో చెప్పండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ నివేదికలో ఏముందో చెప్పండి

ఆ నివేదికలో ఏముందో చెప్పండి

Written By news on Saturday, October 24, 2015 | 10/24/2015


'చంద్రబాబు.. ఆ నివేదికలో ఏముందో చెప్పండి'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పంపిన నివేదికలో ఏముందో బయటపెట్టాలని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు పంపిన నివేదికలో ప్రత్యేక హోదా అంశం ఉందో లేదో ప్రధాని కార్యాలయం నుంచి వివరణ ఇప్పించాలని కోరారు. శనివారం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరుకుంటుందో ముందే వివరణ అడుగుతారని చెప్పారు.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ప్రధానిని ప్రత్యేక హోదా అడగబోయి తడబాటుతో ప్రత్యేక ప్యాకేజీ అడిగానంటూ చంద్రబాబు చెప్పారని, ఆయన ఎందుకిలా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత మాటలతో ప్రజలను ఎన్నిరోజులు ఇబ్బందిపెడతారని నిలదీశారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం లాలూచీ పడకుండా, ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, లేకపోతే ప్రజలు క్షమించరని అన్నారు.  సొంత పార్టీ నేతలే చంద్రబాబును విమర్శిస్తున్నారని, ఇప్పుడు కూడా రెండు కళ్ల సిద్ధాంతమేనా అని బొత్స ప్రశ్నించారు.
Share this article :

0 comments: