శాశ్వత పరిష్కారం చూపాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శాశ్వత పరిష్కారం చూపాలి

శాశ్వత పరిష్కారం చూపాలి

Written By news on Thursday, October 29, 2015 | 10/29/2015


శాశ్వత పరిష్కారం చూపాలి
♦ పొగాకు రైతుల సమస్యపై మోదీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖ రాశారు. పొగాకు రైతుల సమస్యల్ని ఇంతకుముందు మీ దృష్టికి తీసుకొచ్చినపుడు వెంటనే స్పందించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిని పంపించి రైతుల ఆత్మహత్యల వివరాలు తెలుసుకున్నారని, దీంతో సమస్య తీవ్రత మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నానని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. పొగాకు బోర్డు, పొగాకు కొనుగోలు చేసే కంపెనీల మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆయన అన్నారు.

ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందులో ఎక్కువమంది పొగాకు రైతులే ఉండటం బాధాకరమన్నారు. సీజన్ ప్రారంభంలోనే గిట్టుబాటు ధర కల్పించే విషయంపై పొగాకు బోర్డుతో పలుమార్లు మాట్లాడినా, పరిస్థితికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడంలో బోర్డు విఫలమైందన్నారు.

 కౌలు రైతులకూ నష్టపరిహారమివ్వాలి..
 పొగాకుబోర్డు వద్ద రూ.400-రూ.500 కోట్లు పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం ఉందని, అందువల్ల రైతులకు బోర్డు నష్టపరిహారమివ్వాలని వైవీ అన్నారు. బ్యారన్ల యజమానులకే నష్టపరిహారమిస్తున్నారని.. కౌలు రైతులకు పరిహారమెందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. పొగాకు సాగుచేసే రైతుకిస్తున్న వాటన్నింటినీ కౌలు రైతుకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నోఏళ్లుగా ఐటీసీ లాభాలార్జిస్తున్న నేపథ్యంలో బోర్డుకు ఎగుమతుల విషయంలో సాయపడాల్సిన అవసరముందన్నారు.
Share this article :

0 comments: