♦ వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి వెల్లడి
♦ సీఎం కేసీఆర్‌వి ప్రజావ్యతిరేక విధానాలని ధ్వజం
♦ పాలనాపరంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు విఫలమని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి నాలుగు రోజులపాటు వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పార్టీ అభ్యర్థి నల్ల సూర్యప్రకాశ్‌కు మద్దతుగా లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో జగన్ ప్రచారం చేపడతారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కె.శివకుమార్, భీమా శ్రీధర్‌లతో కలసి పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు వైఎస్సార్ ఎలా భరోసానిచ్చారో రాబోయే రోజుల్లో తెలంగాణలోని ప్రజలకు భరోసా కల్పించేలా జగన్ ప్రచారం నిర్వహిస్తారన్నారు.
జగన్‌కు ఉన్న ప్రజాభిమానంతో విపక్షాలు చిత్తుచిత్తుగా ఓడిపోతాయని... పార్టీ శ్రేణులు గెలుపుపై విశ్వాసంతో ఉన్నాయన్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రచారంలో పాల్గొనే ప్రముఖుల పర్యటన వివరాలను ప్రకటిస్తామన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ-టీడీపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అభివృద్ధి నినాదంతో ప్రచారం చేస్తుందని పొంగులేటి చెప్పారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి పేదవాడు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తున్నాడన్నారు. నిండు మనసుతో అభిమానిస్తున్నాడని పొంగులేటి అన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక రాష్ర్టవ్యాప్తంగా ఎంతో మంది మర ణిస్తే వారిలో అత్యధికంగా 73 మంది వరంగల్ జిల్లాలోనే చనిపోయారన్నారు.
ఈ కుటుంబాలన్నింటినీ రాజన్న తనయ షర్మిల ఇటీవలే పరామర్శించారన్నారు. సీఎంగా వైఎస్సార్ రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలను సంక్షేమ పథకాల ద్వారా ఆదుకున్నారని... అలా వివిధ వర్గాల ప్రజలకు భరోసానిచ్చిన ఏకైక సీఎం వైఎస్సార్ అక్కరేనని అన్నారు. పరిపాలనాపరంగా తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వాలు విఫలమయ్యాయని... రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని పొంగులేటి ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. వైఎస్సార్ మరణానంతరం ఇద్దరు కాంగ్రెస్ సీఎంలు జలయజ్ఞం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.

0 comments:
Post a Comment