డిసెంబర్ 2న చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ సభ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డిసెంబర్ 2న చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ సభ

డిసెంబర్ 2న చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ సభ

Written By news on Friday, November 13, 2015 | 11/13/2015


డిసెంబర్ 2న చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ సభ
సాక్షి, హైదరాబాద్: ‘బాక్సైట్ తవ్వకాలు-గిరిజనుల హక్కులు’ అనే అంశంపై డిసెంబర్ 2న పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో తవ్వకాలకు అనుమతించి దాదాపు 3,000 ఎకరాలు కట్టబెట్టడంపై మన్యం భగ్గుమంటోందని ఆయన వివరించారు.

ఈ నేపథ్యంలో గిరిజనుల న్యాయమైన అభిప్రాయాలను, వారి అనుభవాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకునేందుకు, బాక్సైట్ తవ్వకాలను నిరోధించేందుకు పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు పార్టీ తరపున 11 మందితో గిరిజన హక్కుల కమిటీని నియమించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, కె.రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, వంతల రాజేశ్వరి, పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు తెల్లం బాలరాజు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్-పార్టీ ప్రధాన కార్యదర్శి సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, విశాఖపట్నం జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ వి.విజయసాయిరెడ్డి సభ్యులుగా ఉంటార ని తెలిపారు.
Share this article :

0 comments: