హైదరాబాద్: భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అతలాకుతలం అవుతున్న నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. 23, 24 తేదిల్లో నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని రైల్వే కోడూరులో ఆయన పర్యటిస్తారు. ఆ ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారు. ఇప్పటికే ఏపీలోని ఈ రెండు జిల్లాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోగా.. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. వైఎస్ జగన్.. ఆయా జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా అధ్యక్షులను అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీ శ్రేణులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇప్పటికే సూచించారు.
వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలో నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి...బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు.

0 comments:
Post a Comment