ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేశ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేశ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేశ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం

Written By news on Thursday, November 5, 2015 | 11/05/2015


మాపై నీచ ప్రచారం
 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేశ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి, తాను, ఇతర పార్టీలకు చెందిన మరికొందరు నేతలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమై ప్రాంతీయ ఉద్యమాన్ని లేవదీయబోతున్నామంటూ ఏబీఎన్  -ఆంధ్రజ్యోతి చానెల్ నీచమైన ప్రచారానికి తెర లేపిందని వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో చానెల్ యజమాని రాధాకృష్ణ వైఖరిని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ‘వాస్తవానికి నేను హైదరాబాద్‌లోనే లేను. నా నియోజకవర్గంలో ఉన్నా.

చంద్రబాబు హయాంలో మొత్తంగా 13 జిల్లాలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని, ప్రత్యేకించి వెనుకబడిన జిల్లాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదాన్ని ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మేము బహిరంగంగా ప్రజల దృష్టికి  తీసుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మైసూరారెడ్డిని, నన్నూ ప్రస్తావిస్తూ ఈ రోజు ఇచ్చిన కథనం పూర్తిగా ఆ చానెల్ దిగజారుడు జర్నలిజానికి, చెంచాగిరీకి, కుట్ర పూరిత వ్యవహారానికి అద్దం పడుతోంది. తిరుపతిలో ఎకరం భూమి రూ.5 కోట్లు పలుకుతోంటే.. ఎక రా కేవలం రూ.80 లక్షల చొప్పున 1.5 ఎకరాల భూమిని చంద్రబాబు పభుత్వం ఈ చానెల్ యాజమాన్యానికి కట్టబెడుతూ మంత్రివర్గం చేత ఒక తీర్మానం ఆమోదింప జేసుకుంది.

ఇది జరిగిన మరునాడే చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు ఇంతగా దిగజారి పోయి ఆ చానెల్ ఈ  కథనాన్ని అల్లింది. రాష్ట్రంలో ఒకపక్క కరువు నెలకొంది. అప్పుల తో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. పట్టిసీమ నుంచి రాజధాని వరకు, ఇసుక నుంచి మైనింగ్ వరకు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, రాక్షస చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. అన్నింటికీ మించి వంగవీటి మోహనరంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న అంశంపై రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం అంతా అట్టుడుకుతోంది.

వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అప్పనంగా రూ.కోట్ల  ఆస్తిని కట్టబె ట్టిన చంద్రబాబు రుణం తీర్చుకోవడానికే ఈ చానెల్ ఇంతగా దిగజారిపోయి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మీద, మైసూరారెడ్డిపైనా, చివరకు నామీద కూడా పాతాళపు స్థాయి నీచ రాజకీయానికి దిగింది. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు మా పార్టీ వ్యతిరేకం. హైదరాబాద్ అనుభవాల నేపథ్యంలో అటువంటి పని చేయరాదన్నది మా విధానం. ఈ విషయంలో దాపరికం కానీ రాజీ గానీ ఉండబోదు..’ అని గడికోట తన ప్రకటనలో స్పష్టం చేశారు.
Share this article :

0 comments: