ఆ కంపెనీపై ఔదార్యంతో .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ కంపెనీపై ఔదార్యంతో ..

ఆ కంపెనీపై ఔదార్యంతో ..

Written By news on Saturday, November 14, 2015 | 11/14/2015


ఇది సర్కారు వారి భూ బాగోతం
ఆ భూమికి సీసీఎల్‌ఎ-కలెక్టర్ కమిటీ నిర్ధారించిన ధర రూ. 363 కోట్లు...
ఆ కంపెనీపై ఔదార్యంతో ముఖ్యమంత్రి నిర్ణయించిన ధర రూ. 25 కోట్లు...
 

♦ విశాఖలోఐటీ కంపెనీకి భూ పందేరం..
♦ ఎకరా రూ.7.26 కోట్లకు ఏపీఎల్‌ఎంఏ కమిటీ సిఫార్సు.. రూ.50 లక్షలకే
     కేటాయించాలని సీఎం నిర్ణయం
♦ లోకేష్‌బాబుకు ఆ కంపెనీ అధినేత స్నేహితుడు కావడమే కారణం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను ఓ ఐటీ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. తొలుత ఈ భూములను తొలుత ఏపీఐఐసీకి కేటాయించేసి, ఆ తరువాత ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేసేసేలా వ్యూహం రచించింది. అలా రూ.363 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని కేవలం రూ.25 కోట్లకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. కారణం ఆ కంపెనీ అధినేత ‘చినబాబు’ లోకేష్‌బాబుకు సన్నిహితుడు కావడమే. ఈ-సెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్‌కి చెందిన ‘పారడైం నాలెడ్జ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఐటీ కంపెనీకి విశాఖ జిల్లా మధురవాడలోని సింహాద్రి అప్పన్నకు చెందిన 50 ఎకరాల భూమిని ఎకరా రూ.లక్ష చొప్పున నామమాత్రపు లీజుకు కేటాయించేందుకు జూలై నెలలో జరిగిన  కేబినెట్ సమావేశానికి ప్రతిపాదనలు తీసుకువెళ్లాయి.

అయితే ‘అప్పన్న భూములకు ఎసరు’ అనే శీర్షికన అదే రోజు ‘సాక్షి’ వార్తను ప్రచరించడంతోనూ, ఆ భూములను ఇచ్చేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారి అంగీకరించకపోవడంతోనూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేశారు. ఇప్పుడు అదే కంపెనీకి అదే ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను కారుచౌకగా అప్పజెప్పేందుకు ఈ నెల 2వ తేదీన విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొదట ఆ భూమిని 25 కోట్లకే ఏపీఐఐసీకి కేటాయించేశా రు. ఇక దానిని ఐటీ కంపెనీకి బదలాయించడమే మిగిలింది.

 తక్కువ ధరకు సీఎం సిఫార్సు...: విశాఖపట్టణం జిల్లా మధురవాడ గ్రామంలోని సర్వే నెంబర్ 409లో గల 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం రూ.7.26 కోట్లు చొప్పున పరిశ్రమల పార్కు అభివృద్ధి కోసం ఏపీఐఐసీకి కేటాయించేందుకు విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ ఈ ఏడాది గత నెల 10వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణ సంస్థ (ఏపీఎంఎల్‌ఏ) గత నెల 16వ తేదీన సమావేశమైంది. ఈ సంస్థ సీసీఎల్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఎ కార్యదర్శి/ సంయుక్త కమిషనర్ సభ్యులుగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మార్కెట్ విలువ ప్రకారం ఎకరం  రూ.7.26 కోట్లు చొప్పున పరిశ్రమల పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయించాలని సిఫార్సు చేసింది.

అయితే భూమి ధర ఎక్కువగా ఉందని, అంత ధరకు ప్రైవేట్ పెట్టుబడిదారులు రావడం కష్టమని, ధర తగ్గించాలని పరిశ్రమలశాఖతో పాటు ఐటీ శాఖ కూడాకోరాయి. దీంతో ఎకరం రూ.50 లక్షలకు కేటాయించాల్సిందిగా ఐటీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని ఫైలు సర్క్యులేషన్‌లో తీసుకుని ఈ నెల 2వ తేదీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. దీంతో 50 ఎకరాల భూమిని ఎకరం రూ.50 లక్షల చొప్పున ఏపీఐఐసీకి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి జె.సి.శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐఐసీ త్వరలోనే ఈ భూమిని ఈ-సెంట్రిక్ సొల్యూషన్‌కు  బదలాయించనుంది. ఏపీఎంఎల్‌ఎతో పాటు జిల్లా కలెక్టర్ సిఫార్సులను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భూమికి తక్కువ ధరను నిర్థారించడం గమనార్హం.

 లోకేష్ స్నేహమే కారణం...: ఈ-సెంట్రిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు గాది శ్రీధర్ రాజు. 2002లో నెలకొల్పిన ఈ-సెంట్రిక్  సొల్యూషన్స్‌కు అనుబంధంగా 2008లో పారాడైం నాలెడ్జ్ వెంచర్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలోనే విశాఖపట్నం ఎస్‌ఈజెడ్‌లో ఈ-సెంట్రిక్ సెంటర్‌ను ప్రారంభించిన శ్రీధర్ రాజు 21 కంపెనీల్లో డెరైక్టర్‌గా ఉండటం గమనార్హం. అన్నిటికీ మించి ఆయ న ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు స్నేహితుడు. అందువల్లనే అత్యంత తక్కువ ధరకు భూమి కేటాయించేందుకు సర్కారు సిద్ధమైందని తెలుస్తోంది.
Share this article :

0 comments: