
భూ సంతర్పణపై బంధుప్రీతి ఎందుకో?
ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం
ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం
మంగళగిరి: రాష్ట్రంలో జరుగుతోన్న భూ దోపిడీ, ప్రకృతివనరుల దోపిడీ, అవినీతి అక్రమాలకు ఉండవల్లి కరకట్టపై ఉన్న ముఖ్యమంత్రి అక్రమ అతిథిగృహం కేరాఫ్‌గా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
నేటి వరకు తెలుగు తమ్ముళ్లకు మట్టి, ఇసుక వంటి ప్రకృతి వనరుల దోచిపెట్టి తన మార్క్‌ను చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు బంధువులకు భూ సంతర్పణ చేస్తూ బంధుప్రీతికి కోట్ల విలువ గల భూములు ధారాదత్తం చేయడం తగదన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రూ. 500 కోట్ల విలువ చేసే భూములను కేవలం రూ. 5 కోట్లకు కట్టబెట్టడం ఆయన అవినీతికి పరాకష్ట అన్నారు.
మరో వైపు రాజధాని పేరిట రైతులను బెదిరించి, భయపెట్టి లాక్కున్న భూములను బంధువులు, బినామీలు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు విదేశాల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతూ, దోపిడీ కొనసాగిస్తూ అవినీతి చక్రవర్తిగా చంద్రబాబు పేరు గడిస్తున్నారని ఆర్కే దుయ్యబట్టారు.
0 comments:
Post a Comment