కేసీఆర్ మోజు వల్లే వరంగల్ ఉప ఎన్నిక: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసీఆర్ మోజు వల్లే వరంగల్ ఉప ఎన్నిక: వైఎస్ జగన్

కేసీఆర్ మోజు వల్లే వరంగల్ ఉప ఎన్నిక: వైఎస్ జగన్

Written By news on Monday, November 16, 2015 | 11/16/2015


కేసీఆర్ మోజు వల్లే వరంగల్ ఉప ఎన్నిక: వైఎస్ జగన్
వరంగల్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తొర్రూర్‌లో ఆయన ఇవాళ సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించారు. వరంగల్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని వైఎస్ జగన్ అన్నారు.
 
కేసీఆర్ మోజు పడ్డారని, అందువల్లే ఉప ఎన్నికలు వచ్చాయని వైఎస్ జగన్ విమర్శించారు. దళిత ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నా... ఎంపీతో రాజీనామా చేయించారని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నా మంచి పాలన ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ ఉన్నారన్నారు.  ఓ వైపు వర్షం పడుతున్నా...వైఎస్ జగన్ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
 • ఓ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం కోసమే ఈ ఉప ఎన్నికలు వచ్చాయి.
 • ఉప ఎన్నికలు రావడానికి ఇదా కారణమని టీఆర్ఎస్ నేతలను గట్టిగా అడుగండి
 • కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చి అమలుచేయలేదు.
 • అందుకు నిరసనగా రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఉంటే ప్రజలు గర్వించేవారు
 • దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజలు హృదయాల్లో ఉంచుకున్నారు.
 • దివంగత నేత వైఎస్‌ఆర్ పరిపాలనకు ముందు, తర్వాత చాలామంది ముఖ్యమంత్రులను చూశాం
 • అయినా ఎవరూ దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించలేదు.
 • దివంగత నేత వైఎస్‌ఆర్‌ మనమధ్య లేకున్నా.. ఆయన మన గుండెల్లో బతికే ఉన్నారు
 • ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా ఆయన ప్రతి పేదవాడికీ మేలు చేశారు
 • దివంగత నేత స్వర్ణయుగాన్ని ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి
 • ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకొనేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టారు
 • కాలేజీలు ప్రారంభమై ఆరు నెలలు గడిచినా.. ప్రస్తుత ప్రభుత్వం గత ఏడాది ఫీజులు ఇంకా విడుదల చేయలేదు
 • 108 ఫోన్ చేస్తే చాలు అంబులెన్స్ ఇంటివద్దకు వచ్చేవిధంగా వైఎస్‌ఆర్‌ ఏర్పాటు చేశారు
 • జబ్బు చేసిన పేదవాడికి పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స అందించేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు
 • ప్రతి అక్క, ప్రతి చెల్లి లక్షాధికారి కావాలనే ఉద్దేశంతో పావులా వడ్డీకి రుణాలు ప్రవేశపెట్టారు
 • దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది?
 • ఇప్పటివరకు కేవలం 1600 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారంటే.. రాష్ట్ర పరిపాలన ఎంత అధ్వాన్న పరిస్థితిలో ఉందో తెలుస్తోంది.
 • మేం అధికారంలోకి వస్తే డబుల్ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. కేసీఆర్ 18 నెలల పాలనలో 896 ఇళ్లు మాత్రమే కట్టించారు.
 • ఒక్క వరంగల్‌ జిల్లాలోనే 150మందిపైకి రైతులు చనిపోయారు.
 • వరంగల్‌ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు మా పార్టీకే మాత్రమే ఉంది
 • ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి.. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను అఖండ మెజారిటీతో గెలిపించండి

కాగా అంతకు ముందు రోడ్‌ షోలు ద్వారా వైఎస్ జగన్... ప్రజలను కలుస్తున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా  మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి జనగాం మీదుగా పాలకుర్తి చేరుకున్న వైఎస్ జగన్‌.. దద్దేపల్లి, కొండాపురం, ఒగులాపూర్‌, జఫర్‌ గడ్‌,  దమ్మన్నపేట, వర్ధన్నపేట, నందనంల్లో రోడ్‌ షోలు నిర్వహించారు. వర్ధన్నపేట సమీపంలోని  పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా వుండాలని, మంచి  రోజులు వస్తాయని జగన్‌  రైతులకు భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: