
ఆ రోజు జరిగిన సంఘటనను వివరిస్తూ, ‘నవంబర్ 26 వ తేదీన హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానం లో తిరుపతి విమాశ్రయంలో దిగాను. మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోమోహన్ రెడ్డి అదే విమానంలో హైద్రాబాద్ వెళుతున్నారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడి విమానాశ్రయం బయటకు వస్తున్నా... అదే సమయం లో మేనేజర్ రాఙశేఖర్ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విమానం ఎక్కనివ్వడం లేదని కొందరు తనకు ఫిర్యాదు చేసారు. సంబంధిత వ్యక్తి కోసం తాను ఎదురు చూశాను. అతను వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆలస్యానికి కారణాలను ప్రశ్నించా. సరైన సమాధానం ఇవ్వడానికి బదులుగా నాతో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు బాధిత యాత్రికులతో పాటు పలువురు ప్రత్యక్ష సాక్ష్యులున్నారు. కొందరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసారు, అయితే కొద్దిసేపటి తర్వాత సంబంధిత అధికారి, తన సీనియర్ అధికారులు, స్థానిక పోలీసుల సమక్షంలొ క్షమాపణ చెప్పారు.’ అని మిథున్ రెడ్డి వివరించారు.
ఆ సమస్య అంతటితో ముగిసిందని ఆయన అన్నారు. అయితే తాను మేనేజర్ పై దాడి చేసానని రాత్రి సమయం లో ఫిర్యాదు చేసారని, అది వాస్తవం కాదని స్పష్టం చేసారు. సంఘటన ఙరిగిన సమయం నుంచి రాత్రి వరకూ ఏమి జరిగిందో తనకు తెలియదని మిథున్ రెడ్డి చెప్పారు. తమ వాదనను రుజువు చేయడానికి సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేయాలని డిమాండ్ చేసానని, అయితే ఇంతవరకూ వాటిని విడుదల చేయకపోవడాన్ని బట్టి సంఘటన వివరాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారని, రాజకీయ ప్రత్యర్ధుల ప్రోద్భలమే అందుకు కారణమని మిథున్ రెడ్డి చెప్పారు. ఈ విషయం పై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కు ఫిర్యాదు చేసానని, హైకోర్టును ఆశ్రయిస్తానని మిథున్ రెడ్డి తెలిపారు,
0 comments:
Post a Comment