హైదరాబాద్‌లో చూసుకుందాం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హైదరాబాద్‌లో చూసుకుందాం..

హైదరాబాద్‌లో చూసుకుందాం..

Written By news on Monday, November 16, 2015 | 11/16/2015


హైదరాబాద్‌లో  చూసుకుందాం...రా
మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై ఏపీ సర్కార్ ....పోలీసు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతోందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. మచిలీపట్నం పోర్టు భూ సేకరణ, ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన వైఎస్ఆర్ సీపీ నేత పేర్ని నానిపై అక్రమంగా మూడు కేసులు బనాయించి, జైలుకు పంపించారన్నారు. ఆయనకు పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై రాబోయే రోజుల్లో తమ పోరాటం కొనసాగుతుందని కొడాలి నాని తెలిపారు.

చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలని కోడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే హైదరాబాద్‌లోనే చూసుకుందామని ఆయన అన్నారు.  అక్కడ అయితే నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తారని వ్యాఖ్యానించారు. ఇక పార్టీ కార్యాలయం ఖాళీ చేయించే నెపంతో పోలీసులను తనపై ఉసిగొల్పారని, వారి బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదన్నారు.


భువనేశ్వరిని నేను ఇప్పటికీ అమ్మా అంటాను..
గుడివాడ: ఎన్టీఆర్ కుటుంబం అంటే తనకు ఇప్పటికీ గౌరవమే అని, ఆ కుటుంబంలో అందరినీ తాను గౌరవంగా చూస్తానని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించే విషయంలో చంద్రబాబు కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నాను కానీ భువనేశ్వరిని తాను ఏమీ అనలేదని, దూషించలేదని ఆయన సోమవారమిక్కడ పేర్కొన్నారు. భువనేశ్వరిని తాను ఇప్పటికీ అమ్మా అనే అంటానన్నారు.

గుడివాడ సమీపంలో ఉన్న గ్రామానికి ఆము ఇటీవల వచ్చారని, ఆమెతో ఈ విషయం ప్రస్తావించానని కొడాలి నాని అన్నారు. నిమ్మకూరు, మరో ఊరుకు చెందిన కొందరు ఇక్కడకు వచ్చి దౌర్జన్యంగా కార్యాలయంలో ఉన్న సామన్లు తీశారని ...ఇదంతా జరిగాక చంద్రబాబు కుటుంబసభ్యుల హస్తం ఉందని స్పష్టంగా చెప్పామని ఆయన వ్యాఖ్యానించారు. గుడివాడలో ఉన్న తమ కార్యాలయాన్ని ఖాళీ చేయించి చంద్రబాఉ ఏం చేస్తారని కొడాలి నాని ప్రశ్నించారు.
Share this article :

0 comments: