చంద్రబాబు మోసాలను ఎండగడదాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు మోసాలను ఎండగడదాం

చంద్రబాబు మోసాలను ఎండగడదాం

Written By news on Tuesday, November 3, 2015 | 11/03/2015


చంద్రబాబు మోసాలను ఎండగడదాం
సాక్షి, కడప: ‘‘ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చాక చేస్తున్నది మరొకటి. రుణమాఫీ నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసిన బాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చివరకు అవ్వా తాతలను కూడా పింఛన్ పెంపు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి వారి ఉసురు తప్పక తగులుతుంది. ఎవరూ నిరాశ పడొద్దు.. మంచి రోజులు త్వరలోనే వస్తాయి. అందరం కలసి ఆయన మోసాలను ఎండగడదాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

 వైఎస్‌ఆర్ జిల్లాలోని పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సోమవారం ఆయన పర్యటించినపుడు పలువురు వృద్ధులు, మహిళలు వారి కష్టాలు విన్నవించుకోగా జగన్ పైవిధంగా స్పందించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ, పింఛన్లు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేస్తోందని  వివరించారు.సోమవారం మధ్యాహ్నం పులివెందుల చేరుకున్న జగన్‌కు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం ప్రొద్దుటూరు అమ్మవారిశాలలోని శ్రీకన్యకాపరమేశ్వరిదేవిని దర్శించుకున్నారు.

Share this article :

0 comments: