సీబీఐ విచారణకు సిద్ధమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ విచారణకు సిద్ధమా?

సీబీఐ విచారణకు సిద్ధమా?

Written By news on Thursday, November 5, 2015 | 11/05/2015


సీబీఐ విచారణకు సిద్ధమా?
ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ సవాలు

 సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వ పాలనలో సాగుతున్న విచ్చలవిడి అవినీతిపైన, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆస్తులపైన, మంత్రుల అవినీతిపైనా సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సవాలు విసిరింది. చంద్రబాబు అవినీతికి పేటెంట్ తీసుకున్నారని, అసలు అవినీతి రాజ్యాన్ని రాష్ట్రంలో స్థాపించిందే ఆయనని, విచ్చలవిడిగా దోపిడీ సాగుతోందని తీవ్రంగా ధ్వజమెత్తింది. పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి బుధవారమిక్కడ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తాను చేస్తున్న అవినీతిని ఆయా ప్రభుత్వశాఖల అధికారులపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 3న మంగళగిరిలో దీక్ష చేసినప్పుడు ‘రాష్ట్రానికే మోసగాడు చంద్రబాబు’ పేరుతో విడుదల చేసిన పుస్తకంలో 20 అవినీతి అంశాలను పేర్కొంటూ దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలని సవాలు విసిరారని, ఇపుడు తాను కూడా అదేమాట అంటున్నానని బత్తుల అన్నారు.

 అవినీతి సూచీ పెడితే ఫస్ట్ ర్యాంక్ మీదే..
 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో గోదావరి పుష్కరాలు మొదలు పట్టిసీమ, పారిశ్రామికవేత్తలకు రాయితీలు, మద్యం తయారీ విస్తరణకు లెసైన్సులు వంటి వాటిల్లో వేలకోట్ల అవినీతి జరిగిందని బ్రహ్మానందరెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళల్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, దాన్నొక మాఫియాగా తయారుచేశారని చెప్పారు.
Share this article :

0 comments: