ఎన్టీఆర్ ఫొటో పక్కన వైఎస్ఆర్ ఫొటో పెట్టడం వల్లే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్టీఆర్ ఫొటో పక్కన వైఎస్ఆర్ ఫొటో పెట్టడం వల్లే..

ఎన్టీఆర్ ఫొటో పక్కన వైఎస్ఆర్ ఫొటో పెట్టడం వల్లే..

Written By news on Sunday, November 15, 2015 | 11/15/2015


విజయవాడ: పోలీసులు అధికార టీడీపీకి తొత్తులుగా మారి తనపై అక్రమ కేసులు పెట్టారని కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. 12 ఏళ్లుగా ప్రస్తుత ఆఫీసులోని తాను ఉంటున్నానని, ఎన్టీఆర్ ఫొటో పక్కన దివంగత మహానేత వైఎస్ఆర్ ఫొటో పెట్టడం వల్లే వివాదం సృష్టిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోను ఆఫీసులో  తొలగించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం ఉదయం గుడివాడలో వైఎస్సార్ సీపీ కార్యాలయానికి సంబంధించిన వివాదంలో  పోలీసులు నానిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి  తెలిసిందే. పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న అద్దె భవనానికి ఇటీవల యజమాని తాళం వేయడంతో దాన్ని తొలగించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు నానిని అదుపులోకి తీసుకుని కైకలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆఫీసును ఖాళీ చేయాలని రెండు రోజుల క్రితం చెప్పారని, వేరే భవనం చూసుకునే లోపే ఇలా చేశారని నాని చెప్పారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చేయించారని ఆరోపించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే గుడివాడలో టీడీపీ తరపున పోటీ చేయాలని సవాల్ విసిరారు. నిష్పక్షపాతంగా ఉంటానని ప్రమాణం చేసిన చంద్రబాబు, ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని నాని విమర్శించారు.
Share this article :

0 comments: