బాబు, కేసీఆర్ తోడు దొంగలు: రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు, కేసీఆర్ తోడు దొంగలు: రోజా

బాబు, కేసీఆర్ తోడు దొంగలు: రోజా

Written By news on Monday, November 9, 2015 | 11/09/2015

వరంగల్: వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ మాటల మాంత్రికుడు, చంద్రబాబు మూటల మాంత్రికుడు అని విమర్శించారు.

సోమవారం ధర్మసాగర్‌లో ఎన్నికల రోడ్ షో నిర్వహించిన రోజా మాట్లాడుతూ చంద్రబాబు, కేసీఆర్ తోడు దొంగలని, రైతులకు వారు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరువు దుర్భిక్షమే తాండవిస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్ అహంకారం వల్ల వరంగల్ ఉప ఎన్నిక వచ్చిందని, ఉప ఎన్నిక పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు.
Share this article :

0 comments: