Home »
» బాబు సవాల్ స్వీకరించిన అనంత వెంకట్రామిరెడ్డి
బాబు సవాల్ స్వీకరించిన అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం : రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్‌ను మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్వీకరించారు. టీడీపీ హయాంలో రాయలసీమకు జరిగిన అన్యాయంపై బాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సోమవారమిక్కడ స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడు పిలిచినా తన వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. సాగునీరు, కేంద్ర సంస్థల కేటాయింపుల్లో సీమకు అన్యాయం జరిగిందని, చంద్రబాబు విధానాల వల్లే సీమ ఉనికికే అన్యాయంగా మారాయని ఆయన ధ్వజమెత్తారు. రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు అన్యాయంపై ప్రశ్నించడం లేదని, బాబు సీమలో 25సార్లు పర్యటించినా ఒరిగిందేమీ లేదని అనంతర వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.కాగా రాయలసీమ వెనుకబాటుకు స్థానిక నాయకులే కారణమని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను సీమ బిడ్డనేనని, రాయలసీమకు తన కంఠంలో ప్రాణం ఉండగా అన్యాయం జరగనివ్వనని కర్నూలు పర్యటనలో ఆయన సోమవారం అన్నారు. తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీమకు అన్యాయం జరిగిందనేవారు బహిరంగ చర్చకు రావచ్చని ఆయన డిమాండ్ చేసిన విషయం విదితమే.
0 comments:
Post a Comment