పవన్ ప్రశ్నించే ధైర్యం ఎందుకు కోల్పోయారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పవన్ ప్రశ్నించే ధైర్యం ఎందుకు కోల్పోయారు?

పవన్ ప్రశ్నించే ధైర్యం ఎందుకు కోల్పోయారు?

Written By news on Thursday, November 12, 2015 | 11/12/2015


పవన్ ప్రశ్నించే ధైర్యం ఎందుకు కోల్పోయారు?
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తాడనుకున్న పవన్ కల్యాణ్....ఆయనకు అధికార ప్రతినిధిగా మాట్లాడారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.  ప్రశ్నించడానికే పుట్టిందన్న జనసేన పార్టీ అధినేత... ప్రశ్నించడం మానేసి రాజీ ధోరణిలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ... దృష్టి మరల్చడానికే బాబు-పవన్ భేటీ అయ్యారన్నారు. వీరిద్దరి భేటీ అంతా డ్రామాగా ఉందని అంబటి రాంబాబు విమర్శించారు.  

చంద్రబాబు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడే స్థితికి పవన్ కల్యాణ్ ఎందుకు దిగజారారని, పవన్ ప్రశ్నించే ధైర్యం ఎందుకు కోల్పోయారని, ఆయన వెళ్లిన ప్రత్యేక విమానం ఖర్చు ఎవరిదో బయటపెట్టాలన్నారు. టీడీపీ అనుబంధ సంస్థగా జనసేను మార్చబోతున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు 'రాష్ట్రానికి మోసగాడు' పుస్తకాన్ని పవన్‌కు పంపుతామని, ఆ పుస్తకాన్ని చదివైనా అవగాహన చేసుకుని చంద్రబాబును ప్రశ్నించాలని అంబటి రాంబాబు సూచించారు.

పవన్ కల్యాణ్‌తో మాట్లాడేందుకు గన్నవరం విమానాశ్రయానికి రైతులు వచ్చారని, అయితే పవన్ మాత్రం ఫ్లైట్ దిగి నేరుగా కారులో చంద్రబాబు దగ్గరకు వెళ్లిపోయారన్నారు. రైతుల గోడు వినడానికి కూడా పవన్ ప్రయత్నించలేదని అంబటి దుయ్యబట్టారు. భేటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజధాని ప్రాంత రైతులకు పవన్ నిరాశే మిగిల్చారన్నారు. రైతుల సమస్యలను చంద్రబాబుకు పవన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

ఇక బాక్సైట్ తవ్వకాలపై పవన్ కల్యాణ్‌కు అవగాహన లేదని, బాక్సైట్ తవ్వకాలకు తెర తీసిందే చంద్రబాబు అని అంబటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కావాలని ఆరోపణలు చేస్తున్నారా? అవగాహన లేక చేస్తున్నారా? అని అంబటి ప్రశ్నించారు.  ప్రశ్నించడానికే ఉన్నామన్న పవన్ కిందస్థాయికి దిగజారిపోయారని, జనసేన ఎందుకు మారిపోయిందో దాన్ని నమ్ముకున్న అభిమానులకు అర్థం కాని స్థితిలో ఉన్నారన్నారు.
Share this article :

0 comments: