వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలి

వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలి

Written By news on Monday, November 2, 2015 | 11/02/2015


వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలి
ఇంటింటికీ వైఎస్సార్ పథకాలను ప్రచారం చేయూలి
రాజశేఖరరెడ్డి లేని పాలనను ప్రజలు గమనిస్తున్నారు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హన్మకొండలో పార్టీ జిల్లా విస్తృతస్థారుు సమావేశం
పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు
 

కాజీపేట రూరల్ : వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమష్టిగా కృషిచేసి పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తచాటాలని  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపు నిచ్చారు. హన్మకొండలోని శ్రీ కళ్యాణి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల  సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయం గా పనిచేయూలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారం కోసం మెదక్‌లో ఉప ఎన్నిక రావడానికి కారణమయ్యూరని, ఇప్పుడు.. ఒక  దళితుడిని డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి మరొక దళితునికి పదవి ఇవ్వడానికి వరంగల్ ఉప ఎన్నిక తీసుకువచ్చారని విమర్శించారు. ఇది.. కేసీఆర్ రాజకీయ వికృత చేష్టలకు నిదర్శమని అన్నారు. ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని సంక్షేమ పథకాలను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని, కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో హామీల వర్షం కురిసిస్తూ తెలంగాణ ప్రజలను మో సం చేస్తున్నాడని, ప్రజలు ఇది గమనించాలని పొంగులేటి కోరారు. వైఎస్సార్ పాలన లో అమలైన సంక్షేమ పథకాలను  ఇంటింటికీ తిరిగి ప్రజల కు వివరించి ఎన్నికలకు ఆయుధాలుగా వాడుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచిం చారు.

 4న పార్టీ అభ్యర్థి నామినేషన్
 వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా అందరికీ ఇష్టమైన వ్యక్తిని అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తారని, ఆ అభ్యర్థి 4వ తేదీన నామినేషన్ వేస్తాడని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధినే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అభ్యర్థిని గెలిపించుకొని వరంగల్‌లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలందరికీ న్యాయం చేశారని, ఆయన పాలన ఒక చరిత్ర అని అన్నారు. వైఎస్‌ఆర్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.   ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలతో జీవితాల్లో వెలుగులు నింపుకున్న ప్రజలు వైఎస్ కుటుంబంపై నమ్మకంగా ఉన్నారని, ఇటీవల తెలంగాణ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామార్శ యాత్రలో ప్రజలు సొంత ఇంటి బిడ్డగా ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు.

వరంగల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దొర, నవాబు పాలన చేస్తూ ప్రజలను అనేక విధాలుగా మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వా త దళితుడిని సీఎం చేస్తానని చెప్పి దళిత డిప్యూటీ సీఎంను తొలగించాడని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ అంటే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు భయం పుట్టుకొస్తున్నదన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భాద్యత అందరికీ ఉన్నదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివకుమార్, నాయకులు ఇరుగు సునీల్‌కుమార్, వేముల శేఖర్‌రెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, రాష్ట్ర రైతు అధ్యక్షుడు కిష్టారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్య రవీందర్, రాష్ట్ర కార్యదర్శులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, పూజారి సాంబయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రె డ్డి, ముస్తఫా, మతిన్, జిల్లా నాయకులు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, మునిగాల కళ్యాణ్‌రాజ్, ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, అప్పం కిషన్, దుప్పటి ప్రకాష్, సంగాల ఈర్మియా, గౌని సాంబయ్యగౌడ్, రాబర్ట్ విల్సన్, కౌటిల్‌రెడ్డి, దోపతి సుదర్శన్ రెడ్డి, చల్లా అమరేందర్ రెడ్డి, జి.సమ్మయ్య, పి.గాంధీ, బొడ్డు శ్రావన్, అచ్చిరెడ్డి, రజనీకాంత్, రాజేష్ రెడ్డి, ఎన్.దయాకర్, బద్రుద్దీన్‌ఖాన్, సుమిత్ గుప్తా, పవిత్రన్, ప్రతీక్‌రెడ్డి, ముజఫరుద్దీన్ ఖాన్, పి.సంపత్, సంగాల ఈర్మియా తదితరులు పాల్గొన్నారు.   
Share this article :

0 comments: