రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులా!

రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులా!

Written By news on Tuesday, November 17, 2015 | 11/17/2015

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
 
మచిలీపట్నం : టీడీపీ ప్రభుత్వం రైతుల భూములను లాక్కుని విదేశీ సంస్థలకు అప్పగిస్తుంటే అడ్డుకుంటున్న పేర్ని నానిపై అక్రమ కేసులు బనాయించారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కోర్టులో పేర్ని నానిని పలకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట 30 వేల ఎకరాల భూమిని తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని, భూపరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌గా ఉన్న పేర్ని నానిని అరెస్టుచేస్తే ఉద్యమాన్ని నీరుగార్చవచ్చనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు కుట్ర పన్నారన్నారు. ఆ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులపాలు చేస్తున్నారనడానికి గుడివాడ, మచిలీపట్నం సంఘటనలే ఉదాహరణలన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదన్నారు. పేర్ని నాని విడుదలైన అనంతరం అనుబంధ పరిశ్రమల పేరుతో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేస్తామన్నారు. భూములు కోల్పోయే రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు. పేర్ని నాని అరెస్టుతో ప్రభుత్వ వైఖరితో పాటు మంత్రి కొల్లు వైఖరి కూడా వెల్లడైందన్నారు. టీడీపీ నేతలు మితిమీరి వ్యవహరిస్తే దానికి తగ్గట్టు తామూ స్పందిస్తామని నాని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: