ఆ దమ్ము, ధైర్యం ఉందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ దమ్ము, ధైర్యం ఉందా?

ఆ దమ్ము, ధైర్యం ఉందా?

Written By news on Friday, November 13, 2015 | 11/13/2015


ఆ దమ్ము, ధైర్యం ఉందా?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి ఖండించారు. హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో అమరావతికి పంపేశారంటున్న చంద్రబాబు వందలకోట్లు ఆడంబరాలకు ఖర్చు చేస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. మాయమాటలు, అబద్ధాలతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని పార్థసారధి విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందంటూనే ఆడంబరాలకు అడ్డగోలుగా ప్రభుత్వ నిధులు హెచ్చిస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలకు కోతలు వేస్తున్నారని, ప్రజలపై ఆర్టీసీ చార్జీల భారం మోపారని ఆయన ధ్వజమెత్తారు.
 
ప్రబుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఆదాయ వ్యయాలపై ఆర్థికమంత్రి బహిరంగ చర్చకు రావాలని పార్థసారధి సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవ ఆర్థిక పరిస్థితులు వివరించాలని పార్థసారధి డిమాండ్ చేశారు. టీడీపీ నేతలకు వందలకోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

కాగా కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాం. నేను ఇంకా హైదరాబాద్ లోనే ఉంటే ప్రజల తీర్పును అవమానించినట్టు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: