హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, అయితే వరంగల్ ఉప ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విఫలమయ్యామని తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం పొంగులేటి అధ్యక్షతన తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం లోటస్ పాండ్ లో జరిగింది.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నిక వైఫల్యాలకు కారణాలను విశ్లేషించామని, తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు, వచ్చే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

0 comments:
Post a Comment