నీకు దమ్ముంటే నాపై పోటీచేయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీకు దమ్ముంటే నాపై పోటీచేయి

నీకు దమ్ముంటే నాపై పోటీచేయి

Written By news on Monday, November 16, 2015 | 11/16/2015


నీకు దమ్ముంటే నాపై పోటీచేయి
చంద్రబాబుకు నాని సవాల్

 గుడివాడ: ‘చంద్రబాబూ.. నీకు దమ్ముంటే 2019 ఎన్నికల్లో గుడివాడలో నాపై పోటీచేసి గెలువు.. నేను ఓడిపోతే రాష్ట్రం వదిలి వెళ్లిపోతా... నాపై గెలవలేక నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఇటువంటి చిల్లర పనులు చేయటం మానుకో..’ అని ఎమ్మెల్యే కొడాలి నాని  హెచ్చరించారు. గుడివాడలో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసుల్ని, ఇంటి యజమానిని పావులుగా వాడుకుని అరెస్టులు చేయటంపై ఆయన ఘాటుగా స్పందించారు. పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. తాను శాసనసభ్యుడి కార్యాలయంగా వినియోగించుకుంటున్న భవనానికి ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నానని, అయితే కార్యాలయంపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బొమ్మ ఉండటం భవనం యజమానికి ఇష్టం లేదని, ఖాళీ చేయాలని ఇటీవలి చెప్పారని తెలిపారు.

త్వరలోనే ఖాళీ చేస్తామని కూడా చెప్పామన్నారు. శనివారం రాత్రి 9.30 గంటలకు గుడివాడలో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం ఉదయం 9.30 గంటలకు  పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిం చారు. గుడివాడలో తనపై గెలవలేక చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ‘సిగ్గుమాలిన రాజకీయాలు మానుకుని రాష్ట్రం అభివృద్ధిపై దృష్టి పెట్టు.. ఇటువంటి ఉడత ఊపులకు నేనుగానీ, మా అధినేత జగన్‌గానీ భయపడే ప్రసక్తి లేదు’ అని చంద్రబాబునుద్దేశించి స్పష్టం చేశారు.  చట్టప్రకారం తనకున్న హక్కులతో త్వరలోనే అక్కడ నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తానన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడటం వైఎస్సార్ రక్తంలోగానీ, ఆయన కుమారుడు జగన్ రక్తంలోగానీ, తమ రక్తంలోగానీ లేదని చెప్పారు.



ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్టు
గుడివాడ/గుడివాడటౌన్/కైకలూరు: కృష్ణాజిల్లా గుడివాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని పోలీసులు ఆదివారం బలవంతంగా ఖాళీ చేయించి, అడ్డుకున్న ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)ను అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యేని నాటకీయ పరిణామాల మధ్య కైకలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలనే సివిల్ వ్యవహారంలో దాదాపు 200 మంది పోలీసులు ఈ దాడికి పూనుకోవటం కలకలం సృష్టిం చింది. ఈ వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు.పోలీసులు ఎమ్మెల్యేను సాయంత్రం గుడివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి సొంత పూచీకత్తు మీద విడుదల చేశారు.

గుడివాడలోని గౌరీశంకరపురంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం ఉంది. ఈ భవనం యజమాని జి.సుశీల 2002లో పార్టీ కార్యాలయం నిమిత్తం అద్దెకు ఇచ్చారు. సుశీల సీఎం చంద్రబాబుకు బంధువు. రెండేళ్ల కిందట  కొడాలి నాని టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి మారారు. అప్పటి నుంచి పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. పక్కా పథకంతో ఆదివారం దానిన అమలు పరిచారు. పోలీసులే దగ్గరుండి కార్యాలయంలో అద్దెకు ఉంటున్న వారి అనుమతి లేకుండానే బోర్డులకు రంగులు వేశారు. దీన్ని అడ్డుకున్న ఎమ్మెల్యేతోపాటు పార్టీ నేతలు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, నందివాడ, గుడివాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యులు మీగడ ప్రేమ్‌కుమార్, దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేసి గుడివాడ డివిజన్‌లోని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

 గుడివాడ డీఎస్పీ అత్యుత్సాహం..
 గుడివాడ డీఎస్పీ అంకినీడు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన తీరుపట్ల వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకుని గుడివాడ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ వీరంగం సృష్టించారు.  ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేశ్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి తదితరులు గుడివాడకు చేరుకుని అధికారులతో మాట్లాడారు.ఎమ్మెల్యే అరెస్టు గురించి  కృష్ణా జిల్లా ఎస్పీ జి.విజయ్‌కుమార్‌ను‘సాక్షి’ అడగగా  అరెస్ట్‌కు అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే  నానిని అరెస్ట్ చేసిన తరువాత స్పీకర్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు.

 ప్రధానికి ఫిర్యాదు చేస్తా: పార్థసారథి
 తెలుగుదేశం పార్టీ పాలనలో నియంతృత్వ పోకడలు ఉట్టి పడుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి విమర్శించారు. ఎమ్మెల్యే అరెస్టు వార్త తెలిసి గుడివాడ వచ్చిన సారథి విలేకరులతో మాటాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వ భాగస్వామి టీడీపీ అరాచకాలు పట్టవా అని ప్రశ్నించారు.  పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించడం వారి వృత్తినే కించపరిచేలా ఉందన్నారు. దీనిపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

 అద్దె ఇల్లు ఖాళీ చేయాలంటే కోర్టు ఆదేశం తప్పనిసరి
 అద్దె ఇల్లు ఖాళీచేసే సమయంలో వివాదం ఏర్పడినప్పుడు ఇంటి యజమాని అద్దెకు ఉన్న వారికి ప్రస్తుతం జరుగుతున్న నెల చివరి రోజున 15 రోజుల ముందుగా నోటీసు జారీచేయాలి. అప్పటికీ ఖాళీ చేయని పక్షంలో కోర్టును ఆశ్రయించాలి. కోర్టు ఆదేశాలను అమీనా ద్వారా అద్దెకు ఉండే వ్యక్తికి అందజేసి కోర్టు సిబ్బంది సమక్షంలో ఖాళీ చేయించాల్సిందే తప్ప దౌర్జన్యం చేయకూడదని చట్టం చెబుతోంది. అవసరమైన పక్షంలో పోలీసులను ఆశ్రయిస్తే.. పోలీసులు ఇరుపక్షాల వారిని విచారించవచ్చు తప్ప దౌర్జన్యం చేయకూడదు.   
         - మురళి, న్యాయవాది

 ఫోన్‌లో జగన్ పరామర్శ
అరెస్టయి పోలీసు స్టేషన్‌లో ఉన్న ఎమ్మెల్యే కొడాలి నానీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు.
Share this article :

0 comments: