కేసీఆర్ పర్మిషన్ తోనే హైదరాబాద్ కు బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసీఆర్ పర్మిషన్ తోనే హైదరాబాద్ కు బాబు

కేసీఆర్ పర్మిషన్ తోనే హైదరాబాద్ కు బాబు

Written By news on Saturday, November 28, 2015 | 11/28/2015


'కేసీఆర్ పర్మిషన్తోనే హైదరాబాద్కు బాబు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతితోనే హైదరాబాద్లో తిరిగి అడుగుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కేసీఆర్కు చంద్రబాబుకు మధ్యవర్తిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యవహరించారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్ ఇచ్చిన కండీషన్ బెయిల్ మీద చంద్రబాబు ఏపీని పరిపాలిస్తున్నారని అన్నారు. కుమ్మక్కు రాజకీయాలు చేసే చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే హక్కులేదని అంబటి ధ్వజమెత్తారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో.. 'వాట్ ఐయామ్ సేయింగ్ అంటూ' ఫోన్ సంభాషణల్లో అడ్డంగా దొరికిపోయినా, ఇప్పటి వరకు ఆ గొంతు తనది కాదని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని అంబటి చెప్పారు. బినామీ పేర్లతో టీవీ చానళ్లను నడిపించే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో తనకు మద్దతుగా వార్తలు ప్రసారం చేయడంలేదని 13 జిల్లాల్లో ఓ టీవీ చానల్  ప్రసారాలను నిలిపివేశారన్నారు. అంగన్ వాడీ వర్కర్స్ కోసం గతంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలు..ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అంగన్ వాడి వర్కర్స్ను ఉద్దేశించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు.
Share this article :

0 comments: