చిన్నారులను భయభ్రాంతులకు గురిచేసేలా 30 మంది పోలీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిన్నారులను భయభ్రాంతులకు గురిచేసేలా 30 మంది పోలీసులు

చిన్నారులను భయభ్రాంతులకు గురిచేసేలా 30 మంది పోలీసులు

Written By news on Wednesday, December 16, 2015 | 12/16/2015


కాల్‌మనీ, వడ్డీ వ్యాపారాలు టీడీపీ నేతలవే
వైఎస్సార్ సీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు కావటి
ఇంట్లో సోదాలపై ఖండన
టీడీపీ ప్రభుత్వం తీరు అభ్యంతరకరం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్

 
పట్నంబజారు : వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న యూత్ జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున ఎటువంటి ఆరోపణలు లేకుండానే పోలీసులు సోదాలు చేయడాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. కావటి కుటుంబసభ్యులు, చిన్నారులను భయభ్రాంతులకు గురిచేసేలా 30 మంది పోలీసులు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్‌మనీ, వడ్డీ వ్యాపారాలు చేసేది టీడీపీ నేతలే అని ఆరోపించారు. శ్రీనివాసరావుపేటలోని కావటి కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలతో కలిసి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ విలేకరులతో మాట్లాడారు.

కాల్‌మనీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, నేతలు పీకల్లోతు కూరుకుపోతే వారిపై చర్యలు తీసుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం ఇతరులపై బురదచల్లేందుకు యత్నిస్తోందని విమర్శించారు. గతంలో కూడా కావటికి చెందిన బార్‌షాపుల లెసైన్సులు రద్దు చేరుుంచారని, దానిపై పోరాడి మళ్లీ లెసైన్సులు పొందినట్లు గుర్తు చేశారు. ఓ మంత్రి అండదండలతో టీడీపీ నేతలు వడ్డీ వ్యాపారాలు చేస్తుంటే వారిని వదిలి వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేయడం సిగ్గుచేటన్నారు. కాల్‌మనీ కేసులో ఎవరున్నా వారి ఆస్తులు జప్తు చేసి, శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.  యువజన విభాగం  జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేరుుస్తున్న సోదాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సీఈసీ సభ్యుడు రావి వెంకటరమణ తదితరులు మాట్లాడారు. 
Share this article :

0 comments: