వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి

Written By news on Tuesday, December 1, 2015 | 12/01/2015

పశ్చిమగోదావరి: టీడీపీ కార్యకర్తల దుర్మార్గాలకు అడ్డూ అదుపులేకుండాపోతోంది. వారివల్ల పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెర్త గ్రామంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆలపాటి నరేంద్ర ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లోని పర్నీచర్, ధ్వంసమైంది. ఇంట్లో పూలకుండీలన్ని పగులగొట్టారు. ఆలపాటి నరేంద్రకు తీవ్ర గాయాలవగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ఈ దాడిని పలువురు వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. కారుమురి నాగేశ్వరరావు దీనిపై స్పందిస్తూ టీడీపీ కార్యకర్తలు ఇంతటి దాష్టికానికి పాల్పడటం సరికాదని అన్నారు. దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ దాడి పాతకక్షలతోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. చెరువుల విషయంలో గతంలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Share this article :

0 comments: