విశాఖలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశాఖలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం

విశాఖలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం

Written By news on Thursday, December 10, 2015 | 12/10/2015


విశాఖలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.  విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ అనకాపల్లి బయల్దేరారు. అక్కడ నూకాలమ్మ ఆలయాన్ని ఆయన దర్శించుకోనున్నారు.
 
అనంతరం అక్కడ నర్సీపట్నం మీదుగా చింతపల్లి వెళతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు నిరసనగా జిల్లాలోని చింతపల్లిలో ఇవాళ బహిరంగ సభ జరగనుంది. 'విశాఖ బాక్సైట్ - గిరిజనుల హక్కు' అనే నినాదంతో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. బాక్సైట్ ఖనిజ తవ్వకాలపై వైఎస్ఆర్ సీపీ కార్యచరణను ఆయన ప్రకటిస్తారు.
Share this article :

0 comments: