జన్మభూమిలో ప్రభుత్వాన్ని నిలదీయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జన్మభూమిలో ప్రభుత్వాన్ని నిలదీయండి

జన్మభూమిలో ప్రభుత్వాన్ని నిలదీయండి

Written By news on Thursday, December 31, 2015 | 12/31/2015


జన్మభూమిలో ప్రభుత్వాన్ని నిలదీయండి
 ప్రజలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిలుపు

 సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు దఫాలుగా జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన హామీల అమలు ఏమేరకు జరిగిందో మూడోవిడత జన్మభూమిలో గట్టిగా నిలదీయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జనవరి 2 నుంచి మూడోవిడత జన్మభూమి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రజలనుంచి కొన్ని లక్షల అభ్యర్థనలు జన్మభూమి సందర్భంగా ముందుకొస్తే ఒక్కటీ పరిష్కారం కాలేదని పత్రికల్లో వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. సీఎం చంద్రబాబుకు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు.

రెండో జన్మభూమి సందర్భంగా వైఎస్సార్‌సీపీ వంద ప్రశ్నలు సంధించిందని, వాటిని మళ్లీ మీడియాద్వారా విడుదల చేస్తామని, వాటన్నిటినీ దగ్గరుంచుకుని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు దక్కాల్సిన అధికారాలన్నింటినీ జన్మభూమి కమిటీలకు అప్పగించి ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని వైవీ మండిపడ్డారు.

 జన్మభూమి కమిటీకే  పాలన ఇస్తే సరి..!
 రాష్ట్రస్థాయిలోనూ సీఎం, మంత్రివర్గం వీరంతా ఎందుకు? మొత్తం పరిపాలనను జన్మభూమి కమిటీకే ఇస్తే సరిపోతుందికదా... టీడీపీ కార్యాలయం నుంచే పరిపాలన చేసుకోవడానికి సులువుగా ఉంటుంది.. అని వైవీ ఎద్దేవా చేశారు. కేవలం టీడీపీకీ, పార్టీ కార్యకర్తలకు మేలు చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పుడు ‘జన్మభూమి’కోసం విడుదల చేసిన రూ.13 కోట్లూ పచ్చచొక్కాల జేబుల్లోకి వెళతాయన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని వినియోగించే అధికారం ఎమ్మెల్యేలదని, అయితే వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నచోట్ల టీడీపీ ఇన్‌చార్జీలకు నిధులివ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయంటూ.. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఆయన చూపారు.

 అభివృద్ధి లేదు.. అన్నీ కుంభకోణాలే
 రాష్ట్రంలో అభివృద్ధి గురించి మీడియాలో ఊదరగొడుతూ పబ్లిసిటీ చేసుకోవడంతప్ప.. నిజానికి టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయట్లేదని, జరుగుతున్నదంతా కుంభకోణాల అభివృద్ధేనని వైవీ దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టు.. ఇలా ఏది తీసుకున్నా కుంభకోణమేనని, త్వరలో రానున్న విద్యుత్ ప్రాజెక్టుల్లోనూ అవినీతేనన్నారు. రాజధాని నిర్మాణంలో లక్షల కుంభకోణానికి నాంది పలికారన్నారు. రైతులనుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూమిని తీసుకుని సింగపూర్ సంస్థలకు ధారాదత్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
Share this article :

0 comments: