Home »
» భారీ వర్షాలు, వరదలపై వైఎస్ జగన్ ఆరా
భారీ వర్షాలు, వరదలపై వైఎస్ జగన్ ఆరా
హైదరాబాద్ : చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. బుధవారం ఆయన... రెండు జిల్లాల పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ ఈ సందర్బంగా వైఎస్ఆర్ సీపీ పార్టీ శేణ్రులను ఆదేశించారు. కాగా నెల్లూరు జిల్లాలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పంటపొలాలు మళ్లీ నీటమునుగుతున్నాయి. ఊళ్లను నీళ్లు చుట్టుముడుతున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలోనూ మళ్లీ వానకష్టాలు మొదలయ్యాయి. పుత్తూరు మండలం శ్రీరంగంచెరువు, నగరి మండలం బీమానగర్ చెరువు మొరవలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు జలమయయ్యాయి.
0 comments:
Post a Comment