బాబుగారి డాక్టరేట్ అసలు కథ ఇదీ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుగారి డాక్టరేట్ అసలు కథ ఇదీ!

బాబుగారి డాక్టరేట్ అసలు కథ ఇదీ!

Written By news on Friday, December 18, 2015 | 12/18/2015


బాబుగారి డాక్టరేట్ అసలు కథ ఇదీ!
హైదరాబాద్ :
చంద్రబాబుకు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం వెనుక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హల్‌చల్ చేస్తోంది. అమెరికాలో ఒక సాధారణ యూనివర్సిటీ మాత్రమే ఆయనకు డాక్టరేట్ ఇస్తుండగా, టీడీపీ.. దాని అనుకూల మీడియా మాత్రం ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన షికాగో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్టు కథనాలు ప్రచురించాయి. అసలు సంగతి ఏమిటంటే, అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ షికాగో, షికాగో స్టేట్ యూనివర్సిటీ అని రెండు ఉన్నాయి.

నిజానికి చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్నది యూనివర్సిటీ ఆఫ్ షికాగో కాదు... షికాగో స్టేట్ యూనివర్సిటీ మాత్రమే. యూనివర్సిటీ ఆఫ్ షికాగో అయితే.. అమెరికాలోని టాప్ టెన్‌ విశ్వవిద్యాలయాల్లో ఉంటుంది. షికాగో స్టేట్ యూనివర్సిటీ మాత్రం అమెరికాలోనే అత్యంత తక్కువ ర్యాంక్ ఉన్నవాటిలో ఒకటి. మరో కీలక అంశం ఏమిటంటే చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్న షికాగో స్టేట్ యూనివర్సిటీలో తెలుగువాడైన దేవీశ్రీ వి. పొట్లూరి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా ఈ యూనివర్సిటీని సందర్శించారు. ఆ సమయంలో అక్కడి ప్రొఫెసర్ రవి అచంట మంత్రితో పాటు దగ్గరుండి సమన్వయం చేశారు.
Share this article :

0 comments: