కాల్‌మనీ వ్యవహారంలోకి వైఎస్సార్ సీపీని లాగే కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాల్‌మనీ వ్యవహారంలోకి వైఎస్సార్ సీపీని లాగే కుట్ర

కాల్‌మనీ వ్యవహారంలోకి వైఎస్సార్ సీపీని లాగే కుట్ర

Written By news on Wednesday, December 16, 2015 | 12/16/2015


కాల్‌మనీ వ్యవహారంలోకి వైఎస్సార్ సీపీని లాగే  కుట్ర
అధికార పార్టీని కుదిపేస్తున్న కాల్‌మనీ వ్యవహారంలోకి వైఎస్సార్ సీపీ నేతలను లాగేందుకు కుట్ర జరుగుతోందా? అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాల్‌మనీ కేసులో ఇరికించాలని చూస్తున్నారా..? గుంటూరులో మంగళవారం అర్బన్ జిల్లా పోలీసులు జరిపిన సోదాలను చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది..
 
గుంటూరు :  కాల్‌మనీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించడం , ఇందులో విజయవాడకు చెందిన పలువురు అధికారపార్టీ ప్రజాప్రతినిధుల పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో కాల్‌మనీ వ్యవహారంలో వైఎస్సార్ సీపీ నేతల పాత్ర కూడా ఉన్నట్లు చూపేందుకు అధికార పార్టీ తనదైన శైలిలో ‘పచ్చ’ కుట్రకు తెరతీసింది. దీనికోసం ఎప్పటిలానే పోలీస్ శాఖను వాడుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వడ్డీ వ్యాపారంతో సంబంధంలేని వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ళపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వారిని ఇరికించేందుకు చూస్తున్నారు. అయితే  వైఎస్సార్ సీపీ నేత ఇంటిలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో అంతా నాలుక కరుచుకున్నారు.

కాల్‌మనీ వ్యాపారంలో అధికార పార్టీ నేతలు ..
విజయవాడలోనే కాదు గుంటూరులో సైతం కాల్‌మనీ వ్యాపారం మొత్తం అధికార పార్టీ నేతల కనుసన్న ల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యాపారం చేస్తూ పేదలను పిండుతూ కోట్లు గడిస్తున్నారు.ముఖ్యంగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి తోపాటు, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలైన మరో నేత అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు.  జిల్లా పార్టీ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా ఎన్నికల్లో పోటీచేసిన సొంత పార్టీ అభ్యర్థికి కోట్ల రూపాయలు అప్పు ఇచ్చి వడ్డీ వసూలు చేస్తున్నారు.  గుంటూరు నగరంలోని డొంకరోడ్డు, నగరాలు, శారదా కాలనీకి చెందిన అనేక మంది అధికారపార్టీ నేతలు రోజువారీ, చక్రవడ్డీ, మీటరు వడ్డీల పేరుతో దందా కొనసాగిస్తున్నారు.  ఈ వ్యవహారంలో టీడీపీ జిల్లాస్థాయి నేతల నుంచి మాజీ కార్పొరేటర్ల వరకు  ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ వాస్తవం. ఇవి పోలీసులకు మాత్రమే కనిపించకపోవడం శోచనీయం.

వైఎస్సార్‌సీపీ నేత కావటి టార్గెట్‌గా సోదాలు ...

వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కావటి మనోహర్‌నాయుడును లక్ష్యంగా చేసుకుని మంగళవారం పోలీసులు ఆయన ఇంటిలో సోదాలు చేశారు. సుమారు 30 మంది పోలీసులు తెల్లవారుజామునే ఇంటిపై దాడిచేసి అన్ని గదులు తనిఖీ చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో కావటి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వడ్డీ వ్యాపారంతో సంబంధంలేని తన ఇంటిలో సోదాలు జరపడం వెనుక కుట్ర దాగి ఉందని కావటి మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. నాలుగు గంటలపాటు ఇంటిని తనిఖీ చేసినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
Share this article :

0 comments: