
రైతులకు పంట నష్టపరిహారం అందించాలని, పాడి పశువులకు దాణా సరఫరా చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేసి వలసలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించాలని, రానున్న ఖరీఫ్‌లో రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
కరువును ఎలా సమీక్షించారు
కేంద్ర బృందం ఒకటిన్నర రోజుల్లోనే కరువు పరిస్థితులను ఎలా సమీక్షిస్తుందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధానకార్యదర్శి కె.శివకుమార్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ 15 నిమిషాల్లోనే రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులను కేంద్ర బృందానికి ఎలా వివరించారన్నారు. కరువుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
0 comments:
Post a Comment