చేనేత కార్మికులకు చంద్రబాబు మొండిచేయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేనేత కార్మికులకు చంద్రబాబు మొండిచేయి

చేనేత కార్మికులకు చంద్రబాబు మొండిచేయి

Written By news on Thursday, December 3, 2015 | 12/03/2015


రుణమాఫీ కాదు.. చేతకాని మాఫీ
♦ చేనేత కార్మికులకు చంద్రబాబు మొండిచేయి
♦ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శ

 సాక్షి, హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ విషయంలో మోసం చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు చేనేత కార్మికులకు కూడా ద్రోహం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు చేతిలో ద్రోహానికి గురవుతున్న వర్గాల జాబితాలో చేనేత కార్మికులు కూడా చేరుతున్నారని చెప్పారు. చేనేత రుణమాఫీని చేతగాని మాఫీగా మార్చేస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల రుణాలు రూ.365 కోట్ల మేర ఉన్నాయని అధికారులు నివేదిక సమర్పిస్తే ఇప్పుడు రూ.110 కోట్లు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. చెల్లించాల్సిన రుణాల్లో 60 శాతం కోత విధించడం ఏమిటని పార్థసారథి ప్రశ్నించారు. చేనేత కార్మికుల సంక్షేమం గురించి ఎన్నికల ముందు చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోలో చాలా గొప్పలు చెప్పారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక వారికి మొండిచేయి చూపారని దుయ్యబట్టారు.

 రుణ మాఫీ చేయకుండా విలాసాలా?
 వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని కొలుసు పార్థసారథి చెప్పారు. మరణించిన చేనేత కార్మికునికి రూ.1.5 లక్షల పరిహారం చెల్లించేలా జీఓ 119ను తెచ్చారని, వారు పింఛను పొందే వయోపరిమితిని 60  ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. రూ.312 కోట్ల రుణాలను కూడా మాఫీ చేస్తూ జీఓ జారీ చేశారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయకుండా ఆ డబ్బును విలాసాలకు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

 ఆనంకు నైతికత ఉందా? : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి నైతికత లేదంటూ టీడీపీలో చేరిన ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించడాన్ని పార్థసారథి తప్పు పట్టారు. అసలు తనకు నైతికత ఉందా? లేదా? అని తనను తాను ప్రశ్నించుకుంటే మంచిదన్నారు.
Share this article :

0 comments: