ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి ప్రకటన చేయడమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి ప్రకటన చేయడమా?

ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి ప్రకటన చేయడమా?

Written By news on Friday, December 18, 2015 | 12/18/2015


ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి ప్రకటన చేయడమా?
హైదరాబాద్: కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటనపై వైఎస్ జగన్ మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి తన పాటికి తాను ప్రకటనను చదువుకుంటూ వెళ్లారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాటించకుండా సభను నిర్వహించి సభ్యుల హక్కును కాలరాస్తున్నారు. ఇలాంటి శాసన సభను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ సభ్యుల హక్కు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ్యులకు అవకాశం ఇవ్వకుండా కౌరవ సభను నిర్వహిస్తుంటే ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి కాల్ మనీపై స్టేట్ మెంట్ ఇవ్వడం, దానిపై మాట్లాడటానికి సభ్యులకు అవకాశం ఇవ్వకపోవడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేసులో నిందితులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇక్కడే ఉన్నారు. వారిని అరెస్ట్ చేయలేదు. మరి బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. వారిపై దాడి జరుగుతున్న చిత్రాలను ప్రదర్శించిన ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నందుకు ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.
Share this article :

0 comments: