Home »
» కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?
కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మహిళా సాధికారిత బూటకమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం, అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించడం మహిళా సాధికారితా అని ప్రశ్నించారు.మహిళలకు ఇసుక్ రీచ్ లు అప్పగించే పేరుతో టీడీపీ నేతలు ఇసుక మాఫియా నడుపుతున్నారని తమ్మినేని సీతారాం విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులు ముమ్మాటికీ టీడీపీ నేతలేనని ఆరోపించారు.
0 comments:
Post a Comment