అందుకే సవాంగ్ ను సెలవుపై పంపారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అందుకే సవాంగ్ ను సెలవుపై పంపారు

అందుకే సవాంగ్ ను సెలవుపై పంపారు

Written By news on Tuesday, December 15, 2015 | 12/15/2015


'అందుకే సవాంగ్ ను సెలవుపై పంపారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాల్ మనీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ కేసులో నిందితులను రక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ముక్కుసూటిగా పనిచేసే వ్యక్తి కావడంతో, నిందితులను కాపాడేందుకోసం కమిషనర్ ను సెలవుపై పంపించారని అంబటి అన్నారు.

విజయవాడ పోలీస్ కమిషనర్ ను ఇప్పుడు సెలవుపై పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని అంబటి ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా పనిచేసిన ఎస్పీలను గతంలో కూడా బదిలీ చేశారని అంబటి పేర్కొన్నారు.
Share this article :

0 comments: