అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం

అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం

Written By news on Friday, December 25, 2015 | 12/25/2015

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార టీడీపీ సభ్యుల తీరు దారుణమని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలను ఏకపక్షంగా విడుదల చేశారని మండిపడ్డారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ఊదరగొట్టారని, ఇప్పుడు ఇంటికో ఉద్యోగం తీసేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో మాజీ సైనికుల కోసం డిఫెన్స్ క్యాంటీన్ ను మంజూరు చేసినట్టు చెప్పారు. శనివారం ఒంగోలులో నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
Share this article :

0 comments: