రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటీ

రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటీ

Written By news on Sunday, December 20, 2015 | 12/20/2015


రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటీ
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలతో కలసి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ను కలిశారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ప్రణబ్.. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేసిన సంగతి తెలిసింది.

వైఎస్ జగన్ ముఖ్యంగా నాలుగు విషయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన్నట్టు తెలుస్తోంది. మహిళల మాన, ప్రాణాలతో ఆడుకున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు, ఏపీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయాల గురించి వైఎస్ జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Share this article :

0 comments: